రైతులకు అండగా నిలిచిన పవన్ కళ్యాణ్ చిత్ర పటానికి పాడేరు జనసేన పాలాభిషేకం

పాడేరు, ఇటివలే రాష్ట్రంలో ఆత్మహత్యలకు పాల్పడిన కౌలు రైతుల కుటుంబాలకు అండగా నిలచి వాళ్లకు అండగా నిలబడి ఆయన కష్టజీతం అయినటువంటి 5 కోట్ల రుపాయలు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఇవ్వడం జరిగింది అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం చేయవలసిన పనిపవన్ కళ్యాణ్ చేయడం గర్వించదగ్గ విషయం అందుకనే ఆయన రైతులకు అండగా నిలబడిన పవన్ కళ్యాణ్ కి పాలాభిషేకం చేయడం జరిగింది. అలాగే ప్రభుత్వాన్ని మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం ఆత్మహత్యలకి గురి అయ్యిన రైతులకు తక్షణమే నిధులు కేటాయించి అన్నం పెట్టే రైతులకు న్యాయం చేయాలని జనసేన పార్టీ ద్వారా మేము డిమాండ్ చేస్తున్నాం అలాగే రానున్న రోజులలో రైతులకు న్యాయం జరగలేని మరుక్షణం జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు నిరసన కార్యక్రమం బలంగా ముందుకు తీసుకొనివెళ్తామని మరొకసారి తెలియజేస్తున్నామని అలాగే పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు ప్రతి కార్యక్రమంలో ప్రతి జనసైనికుడు వీరమహిళలు పవన్ కళ్యాణ్ కి అండగా ఉంటామని తెలియజేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో పాడేరు జనసేన పార్టీ మండల అధ్యక్షులు నందోలి మురళీకృష్ణ, అరకు పార్లమెంట్ ఎక్ససిక్యూటివ్ కమిటీ మెంబెర్ కొర్ర కమల్ హసన్, పాడేరు అధికార ప్రతినిధి బొనుకుల దివ్యలత, కాకినాడ రూరల్ క్రియాశీలక సభ్యుడు సీ హెచ్ అనిల్ కుమార్, మణికంఠ, పవన్, సత్తిబాబు, రాజు, బాలకృష్ణ, శంకర్, తదితరులు పాల్గొని కార్యక్రమం విజయవంతం చేశారు.