జనసేన పల్లెపోరు.. రోడ్లు, డ్రైనేజీల సమస్యలపై గళమెత్తిన బొలిశెట్టి

  • వైసీపీ అధికారంలోకి వచ్చి 3 సం.రాలు దాటినా రోడ్లు, డ్రైనేజీల వ్యవస్థ అస్తవ్యస్తం.. జనసేన పల్లెపోరులో బొలిశెట్టి

తాడేపల్లిగూడెం: ఆంధ్రప్రదేశ్ లో అత్యధిక ప్రాంతాల్లో రోడ్లు మరియు డ్రైనేజీ లు అస్తవ్యస్తంగా తయారయ్యాయని, వైసీపీ ప్రభుత్వం పట్టించుకోవడమే మానేసిందని బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు. తాడేపల్లిగూడెం నియోజకవర్గం, పెంటపాడు మండలం, ముదునూరు ముక్తెపురం గ్రామంలో శుక్రవారం జరిగిన జనసేన పల్లెపోరులో శ్రీనివాస్ మాట్లాడుతూ.. ఆంధ్ర ప్రదేశ్ లోనే కాకుండా మన గ్రామాలలో మరియు పట్టణాల్లో ఒక మీటర్ కి ఒక గుంట ఉందని, అదే కాకుండా డ్రైనేజీ వ్యవస్థ లేక మురుగునీరు గుమ్మాల్లోకి పారుతుందని, ఆ మురుగనీటి వల్ల ఇంట్లో విష జ్వరాలు వ్యాపిస్తున్నాయని శ్రీనివాస్ అన్నారు. ఇకనైనా వైసీపీ ప్రభుత్వం మొద్దునిద్ర నుంచి లేచి ప్రజల కోసం పనిచేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జనసేన పెంటపాడు మండలం అధ్యక్షులు, నాయకులు తాడేపల్లిగూడెం నియోజకవర్గం జనసేన నాయకులు, జనసైనికులు మరియు వీర మహిళలు పాల్గొన్నారు.