మూడు వసంతాలు పూర్తిచేసుకున్న జనసేన పార్టీ ఉచిత వాటర్ ట్యాంకర్

రాజోలు, మూడు సంవత్సరాల పూర్తి చేసుకుని నాలుగో సంవత్సరంలోకి అడుగుపెడుతున్న చిరు పవన్ సేవా సమితి జనసేన పార్టీ ఉచిత వాటర్ ట్యాంకర్. ఈ సందర్భంగా చిరు పవన్ సేవా సమితి జనసేన పార్టీ ఉచిత వాటర్ ట్యాంకర్ వ్యవస్థాపకులు నామన నాగభూషణం మాట్లాడుతూ ఈ ట్యాంకర్ ద్వారా ఈ మూడు సంవత్సరాలుగా అనేక గ్రామాలలో ఉచిత త్రాగునీరు అందించుటకు సహకరించిన దాతలకు ఈ ట్యాంకర్ కొనడానికి సహకరించిన దాతలకు ట్రాక్టర్ కొనడానికి సహాయం చేసిన యు.ఏ.ఈ జనసేన గల్ఫ్ సేన వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. ఈ ట్యాంకర్ ద్వారా అనేక వేల సంఖ్యలో ప్రతిరోజు ప్రజలకు ఉచితంగా త్రాగునీరు అందించే అవకాశం నాకు కలగడం చాలా సంతోషకరం. ఈ ట్యాంకర్ ద్వారా ఉచితంగా త్రాగునీరు అందించేందుకు దాతలు లేని సందర్భంలో కూడా నేను వెనక అడుగు వేయకుండా నా సొంత ఖర్చులతో తిప్పుతున్నాను దానికి ఒకటే కారణం జనసేన పార్టీని ప్రజల్లో ఉంచాలి. ప్రజలకు మనం చేసి సేవ చూసి 10 ఓట్లు పడాలి అనేదే నా లక్ష్యం అని అన్నారు.

Share this content:

Post Comment