భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండల జనసేన పార్టీ భద్రాచలంలో ఆరు అంతస్తుల భవనం కూలిన ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేయడం జరిగింది. ఇటువంటి ఘటన సాక్షాత్తు రాముడు కొలువై ఉన్న భద్రాచలంలో ఈ ఘటన జరగడం మమ్ములను తీవ్రంగా కలచివేచింది ఈ ఘటనలో చనిపోయిన భవన నిర్మాణ కార్మికుల కుటుంబాలకు మా ప్రగాఢ సానుభూతి తెలియపరుస్తూ ఎవరైతే ప్రాణాలు కోల్పోయారు వారి కుటుంబాలకు తగిన న్యాయం చేయాలని వారి కుటుంబాలను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని, ఈ సందర్భంగా తెలియజేస్తు అంతేకాకుండా ఇటువంటి నాణ్యతా లోపం మరియు పర్మిషన్ లేని ఇటువంటి కట్టడాలను వెంటనే గుర్తించి వాటిని తొలగించాలని ఇటువంటి ఘటనలు మరల పునారావృతం కాకుండా చూడాలని జనసేన పార్టీ తరఫున రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరిగింది.
Share this content:
Post Comment