విశాఖ ఉక్కు.. ఆంధ్రుల హక్కు.. విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణకు జనసేన పార్టీ డిజిటల్ క్యాంపెయిన్.

విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణకు జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు జనసేన డిజిటల్ క్యాంపెయిన్ లో కృష్ణా జిల్లా జనసేన పార్టీ సంయుక్త కార్యదర్శి ఈమని కిషోర్ కుమార్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనేది ఒక నినాదం కాకుండా ఆంధ్రుల ఆత్మగౌరవంగా భావించే పరిశ్రమను నేడు ప్రైవేటీకరణ చేస్తున్నా మన రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ మన రాష్ట్ర ఎంపీలు కానీ కేంద్రాన్ని వారు తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ఎక్కడా కోరడం లేదు అని, అందుకే రాష్ట్ర ప్రజల శ్రేయస్సు కోసం అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ విశాఖ స్టీల్ ప్లాంట్ పరిశ్రమ పరిరక్షణ కోసం ఈ ప్రజా ప్రతినిధులకు తెలిసేలా, డిజిటల్ క్యాంపెయిన్ ఏర్పాటు చేశారు అని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ పార్లమెంట్ సభ్యులకు తమ సొంత ప్రయోజనాల కోసమే కాకుండా విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణను వ్యతిరేకంగా మాట్లాడాలని, విజయవాడ పార్లమెంట్ పరిధి నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న ఎంపీ కేశినేని నాని కూడా బలంగా ఈ ప్లకార్డులు చూపించి పార్లమెంట్ లో పోరాడాలని జనసేన పార్టీ తరుపున మా అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి తరుపున కోరుచున్నాము అని ఆయన తెలిపారు.