డయేరియా బాధితుల కుటుంబాలకు జనసేన పార్టీ ఆధ్వర్యంలో చెక్కుల పంపిణీ

విజయనగరం, గుర్ల గ్రామంలో డయేరియా బాధితుల కుటుంబాలకు జనసేన పార్టీ ఆధ్వర్యంలో లక్ష రూపాయల చెక్కుల పంపిణీ చేయడం జరిగింది. గత ఏడాది అక్టోబర్‌లో గుర్ల గ్రామంలో డయేరియా కారణంగా మరణించిన పదిమంది బాధితుల కుటుంబాలకు జనసేన పార్టీ తరఫున ఆర్థిక సహాయం అందజేశారు. బాధితుల కుటుంబాలను పరామర్శించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, తమ వ్యక్తిగత నిధుల నుండి ఒక్కో కుటుంబానికి లక్ష రూపాయల ఆర్థిక సాయం అందజేస్తానని ప్రకటించారు. ఈ ప్రకటనను అమలుచేసేందుకు జనసేన పార్టీ నాయకులకు పవన్ కళ్యాణ్ ప్రత్యేక ఆదేశాలు ఇచ్చారు. ఈ మేరకు నెల్లిమర్ల ఎమ్మెల్యే శ్రీమతి లోకం నాగ మాధవి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర టిడ్కో చైర్మన్ వేములపాటి అజయ్ కుమార్, రాష్ట్ర ఎంఎస్ఎంఈ చైర్మన్ టి.శివశంకర్, తూర్పు కాపు కార్పొరేషన్ చైర్మన్ శ్రీమతి పాలవలస యశస్వి, జనసేన పిఏసి సభ్యురాలు శ్రీమతి పడాల అరుణ బాధిత కుటుంబాలకు చెక్కులను అందజేశారు. బాధిత కుటుంబాలను పరామర్శించిన అతిథులు, జనసేన పార్టీ బాధితుల కుటుంబాలకు అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. అనేక మంది జనసేన నాయకులు, జనసైనికులు, వీర మహిళలు ఈ కార్యక్రమానికి హాజరై, బాధిత కుటుంబాలను పరామర్శించి తమ సానుభూతిని తెలియజేశారు.

Share this content:

Post Comment