జనసేనపార్టీ జెండా ఆవిష్కరణ

కోనసీమ జిల్లా, అమలాపురం రూరల్ మండలం నల్లమిల్లి గ్రామంలో జనసేన పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ ఆవిష్కరణకు ముఖ్యఅతిథిగా అమలాపురం పార్లమెంటరీ జనసేన పార్టీ ఇంచార్జి డిఎంఆర్ శేఖర్ దంపతులు హాజరయ్యారు. అమలాపురం రూరల్ మండలం అధ్యక్షులు లింగోలు పండు చేతుల మీదుగా జెండా ఆవిష్కరణ జరిగినది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు వీర మహిళలు జనసైనికులు గ్రామస్తులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.