ఘనంగా జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

*జనసేన క్రియాశీల కార్యకర్తల సభ్యత్వ భీమా కిట్ల పంపిణీ కార్యక్రమం

సోమవారం మార్చి 14 జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నర్సంపేట పట్టణంలోని సిటిజన్ పంక్షన్ హాలులో నియోజకవర్గ నాయకుడు మేరుగు శివ కోటీ యాదవ్ అధ్వర్యంలో ముఖ్య కార్యకర్తల సమక్షంలో కేక్ కటింగ్ చేసి, కార్యకర్తలకి స్వీట్స్, అల్పాహారం అందించి ఘనంగా నిర్వహించడం జరిగింది. అలాగే పార్టీ కోసం పని చేసే ప్రతి జనసేన కార్యకర్త కుటుంబ భద్రత, భరోసా కోసం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రవేశపెట్టిన 5 లక్షల ప్రమాద భీమా వర్తించే గతంలో సభ్యత్వం తీసుకున్న కార్యకర్తలకి క్రియాశీల కిట్లను అందించడం జరిగింది. ఈ సందర్భంగా నియోజకవర్గ నాయకుడు మేరుగు శివ కోటీ యాదవ్ మాట్లాడుతూ… ప్రజా సంక్షేమం కోసం, బావితరాల భవిష్యత్తు కోసం జన సేన పార్టీ ఆవిర్భవించింది అన్నారు. అలాగే ఈ రోజు జనసేన పార్టీ సామాన్యులకి, అనాధలకి, అభాగ్యులకి, అండగా నిలుస్తూ, వివిధ రంగాలలో ప్రావీణ్యం ఉండి ఆర్థికంగా వెనుకబడిన వారిని గుర్తించి ప్రోత్సహిస్తూ, ముఖ్యంగా యువత, స్త్రీలకు, వెనకబడిన బహుజన నిమ్నవర్గాల వారికి రాజకీయ అవకాశం కల్పిస్తూ, వారి అభ్యున్నతి కోసం పాటుపడుతుంది అని తెలిపారు. అలాగే రాబోయే 2024 ఎన్నికల్లో జనసేన పార్టీ ఆంధ్రప్రదేశ్ లో అధికారంలోకి వస్తుందని, తెలంగాణలో ఒక బలమైన పార్టీగా అవతరించి తెలంగాణ రాష్ట్ర ఆశయాలసాధన కోసం, అభివృద్ధి కోసం కృషి చేస్తుంది అని తెలిపారు. అలాగే పార్టీ కోసం పని చేసే ప్రతి జనసేన కార్యకర్త రానున్న మలి దశలో 5 లక్షల భీమా వర్తించే పార్టీ సభ్యత్వం తీసుకోవాలని పిలుపునిచ్చారు.కార్యక్రమంలో కార్యవర్గ సభ్యులు వంగ, మధు, కే. రాజుకుమార్, కోల మౌనిక, జి రంజిత్, ఒ రాజేందర్, డేవిడ్, కార్తీక్, అజయ్ రత్న, సాయి, చంటి, శషి, చరణ్, అరుణ్, సురేష్, కిరణ్, రమేష్, సందీప్, రవి, బిరాన్, ప్రవీణ్ రమేష్, క్రాంతి, రణధీర్, మహేష్ తదితరులు పాల్గొన్నారు.