యస్.కే యూనివర్సిటీ లో భగత్ సింగ్ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

జనసేన పార్టీ 9వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు యస్.కే యూనివర్సిటీ మెయిన్ గేట్ ఎదుట భగత్ సింగ్ విద్యార్థి విభాగం నాయకుల ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో భగత్ సింగ్ విద్యార్థి విభాగం నాయకులు లోకేష్ మాట్లాడుతూ.. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం ఏర్పడ్డాక రెండు ప్రభుత్వాలు నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తామని విద్యార్థులను నమ్మించి ఓట్లు వేయించుకొని గెలిచాక నిరుద్యోగులను ముంచుతున్నరు.. రాష్ట్రంలో ఎంతో మంది ఉద్యోగాలు రాక ఆత్మహత్యలు చేసుకుంటుంటే.. ప్రభుత్వం మొండి వైఖరి చూపిస్తున్నాయి.. జనసేన పార్టీ స్థాపించి 8 వసంతాలు పూర్తి చేసుకొని 9వ వసంతాన్ని దిగ్విజయంగా పూర్తి చెయ్యాలని కోరుతున్నాము. జనసేన పార్టీ 2024 లో అధికారంలోకి వచ్చాక నిరుద్యోగులకు న్యాయం జరుగుతుందన్నారు.. పవన్ కళ్యాణ్ విలువలతో కూడిన రాజకీయాలు, సిద్దాంతాలు మార్పుకు నాంది పలుకుతున్నాయి. దేశంలో మొట్టమొదటి జీరో బడ్జెట్ పాలిటిక్స్ చేసిన వ్యక్తి అని కొనియాడారు.. రాష్ట్రం లో ప్రజలందరూ జనసేనతో మార్పు కోరుకుంటున్నారు అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో విద్యార్థి విభాగం నాయకులు సునీల్, వంశీ, బాషా, సంతోష్, రాజు, మహేష్, పవన్, ఆంజనేయులు, పవన్ కళ్యాణ్ అభిమానులు తదితరులు పాల్గొని విజయవంతం చేశారు.

This image has an empty alt attribute; its file name is WhatsApp-Image-2022-03-15-at-7.23.56-PM.jpeg