జనసేన 12వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని, అమెరికాలోని శాన్‌ఫ్రాన్సిస్కో బే ఏరియాలో జనసైనికులు జనసేన జయకేతనాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జనసైనికులు పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్‌ను అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో నడిపించడంతో పాటు దేశ రాజకీయాల్లో కీలక నాయకుడిగా ఎదుగుతారని విశ్వాసం వ్యక్తం చేశారు. జనసేన నాయకులు చంద్ర పతివాడ చిన్నపిల్లలను పర్యావరణ సంరక్షణకు ప్రేరేపించేందుకు జె.ఎస్.అవార్డ్స్ ప్రోగ్రామ్‌ను ప్రారంభించినట్టు ప్రకటించగా, సత్య బొలిశెట్టి ఈ ప్రోగ్రామ్‌కు అడ్వైజర్‌గా ఉంటారని తెలిపారు. పిఠాపురంలో జనసేన చేపట్టిన వేస్ట్ మేనేజ్‌మెంట్ ప్రాజెక్ట్ గురించి రమాకాంత్ వివరించగా, వీరబాబు, శంకర్, సత్య పుట్టా తదితరులు తమ నియోజకవర్గాల్లో చేపట్టిన జనసేన కార్యక్రమాలను పంచుకున్నారు. నిషాంత్ మల్లిపూడి జనసేన కోసం రూపొందించిన యాండ్రాయిడ్ యాప్ జనసహస్రను పరిచయం చేయగా, అనిల్ అరిగె జనసేనకు నెల నెలా సపోర్ట్ ప్రోగ్రామ్ గురించి వివరించారు. ఈ కార్యక్రమాన్ని ఆహ్వాన్ యాప్ ద్వారా నిర్వహించగా, చంద్ర పతివాడ, రాజేష్ భీమ, వెంకట్ పరుచూరి ఈవెంట్‌కు స్పాన్సర్ చేశారు. తులసీరాం రావూరి ఈ సమావేశాన్ని విజయవంతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం ప్రపంచవ్యాప్తంగా ఉన్న జనసైనికుల సంఘీభావానికి ప్రతీకగా నిలిచింది. ఈ కార్యక్రమంలో జనసేన ఆవిర్భావం నుండి తోడుగా ఉన్న ఎన్నారై జనసైనికులు రమాకాంత్ చుండూరి, చంద్ర పతివాడ, నిషాంత్ మల్లిపూడి, వీరబాబు, రెడ్డియ్య ప్రత్తిపాటి, శంకర్ అడబాల, దుర్గా పెద్దిరెడ్డి, వీరా దాడి, శ్రీనివాస్ కామిశెట్టి, అనిల్ అరిగె, కిరణ్ విన్నకోట, ప్రసాద్ మంగెన, అనిల్ రాచకొండ, రామదాసు పులి, సత్య పుట్టా రంగా, బాబు టేకి, కిరణ్ మువ్వల, కిరణ్ ఇండుగుల పాల్గొన్నారు. సమావేశంకి హాజరు కాలేకపోయిన కొంతమంది ఎన్నారైలు కృష్ణ మోహన్ నల్లబల్లి, వేణు అనుగంటి, సుబ్బు పప్పుల, మూర్తి పిట్టా, శ్రీకాంత్ కే, జగదీష్ జి వంటి వారు రిమోట్ గా శుభాకాంక్షలు తెలియచేసారు.
Share this content:
Post Comment