జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ పోస్టర్‌ను ఆవిష్కరించిన సంగం మండల జనసేన నాయకులు

జనసేన పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం కొణిదల పవన్ కళ్యాణ్ సూచనల మేరకు, ఆంధ్రప్రదేశ్ టిట్కో చైర్మన్ వేములపాటి అజయ్ ఆశీస్సులతో, సంగం మండల జనసేన పార్టీ సీనియర్ నాయకులు & ఆత్మకూరు నియోజకవర్గ చిరంజీవి యువత అధ్యక్షులు దాడి భాను కిరణ్ ఆధ్వర్యంలో ఈరోజు ఆత్మకూరు నియోజకవర్గంలోని సంగం మండల బంగ్లా సెంటర్లో, పిఠాపురం లో ఈ నెల 14వ తేదీన జరగబోయే “జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం” కార్యక్రమంకు సంబంధించిన పోస్టర్‌ను జనసేన పార్టీ సంగం మండల ముఖ్య నాయకులతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా, దాడి భాను కిరణ్ మాట్లాడుతూ, “దశాబ్ద కాలంలో ఎన్నో పోరాటాలు, ఒడిదుడుకుల తర్వాత అధికార భాగస్వామ్యంతో పండగ వాతావరణంలో జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తున్నాం” అని తెలిపారు. పిఠాపురం నియోజకవర్గంలోని చిత్రాడ గ్రామంలో జరగబోయే జనసేన పార్టీ ఆవిర్భావ సభకు ఆత్మకూరు నియోజకవర్గంలోని సంగం మండల జనసేన నాయకులు, వీర మహిళలు పెద్ద సంఖ్యలో తరలిరావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ సంగం మండల ఉపాధ్యక్షులు చల్లా రవిచంద్ర, సంగం మండల జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి దంతాల హజరత్, సంగం మండల జనసేన పార్టీ నాయకులు యామల రాజా, రాపిన అనిల్, గుంజి జయరాజు, అహ్మద్ భాషా, నెల్లూరు వెంకటేశ్వర్లు, అవినాష్ రెడ్డి, దారా కిషోర్, వంగల్లు రాకేష్, చందు, తాజుద్దీన్, రహీం, చిరంజీవి, తరుణ్ తదితరులు పాల్గొన్నారు.

Share this content:

Post Comment