తిరుపతి జనసేన పార్టీ ఇన్చార్జి కిరణ్ రాయల్ అధ్యక్షతన ప్రెస్ మీట్

*జగన్ ఇలాకాలో పవన్ తడాఖా చూపించబోతున్నాడు

*జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం సూపర్ సక్సస్ అయింది

*జగన్ ఉన్న తాడేపల్లి లో ఈ సభా ద్వారా పవన్ సత్తా చూపించాడు

*ఎన్నో అడ్డంకులు సృష్టించారు, కానీ సభను ఆపలేక పోయారు

తిరుపతి జనసేన పార్టీ ఇన్చార్జి కిరణ్ రాయల్ అధ్యక్షతన మీడియా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కిరణ్ రాయల్ మాట్లాడుతూ.. మార్చి14 న జరిగిన జనసేన పార్టీ ఆవిర్భావ సభకు వచ్చిన ప్రభంజనం చూసి జనసేన పార్టీలోకి వలసలు మొదలయ్యాయి. వైసిపి నేతలు త్వరలో జనసేన పార్టీలోకి రానున్నారు. జనసేన పార్టీ ఆవిర్భావ సభ తరువాత జగన్ రెడ్డి వారి పార్టీ ఎమ్మెల్యే లను కాపాడుకునేందుకు అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. నూతన ప్రభుత్వం కోసం ఎవరినైనా కలుపుకొని వెళ్తాం, అది మా ఇష్టం, వైసిపి కి ఎందుకు దిగులు. పవన్ దమ్మెందో మొన్న సభ ద్వారా ద్వారంపూడి చంద్రశేఖర్ కి తెలిసింది. మంత్రుల నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారు.. మేము నోరు తెరిస్తే మీరు తట్టుకోలేరు, కానీ మా నాయకుడు మాకు సంస్కారం నేర్పించాడు. తిరుపతిలోని అధికార పార్టీ వారి భూ కబ్జాలు పేట్రేగిపోతున్నాయి. కార్పొరేటర్లు వారి పరిధిలో ఏ నిర్మాణం జరిగిన కమిషన్లు ఇవ్వాలి.. అలాగే భూ యజమానులను బెదిరించి సెటిల్మెంట్ చేసుకోమని పోలీసుల చేత బాధితులను బెదిరిస్తున్నారు. తిరుపతిలో వైసిపి మనుషులు ఈ ఐదు సంవ్సరాలపాటు దోచుకున్న భూములను తిరిగి బాధితులకు ఇప్పిస్తాం అని తెలియ జేశారు. ఈ సమావేశంలో సిటీ ప్రెసిడెంట్ రాజా రెడ్డి, రాజెష్ యాదవ్, బాబ్జి,హేమకుమార్, సుమన్, మునిస్వామి, బలరాం, మనోజ్, సాయిదేవ్, కృష్ణ లు పాల్గొన్నారు.