కౌలు రైతులకు అండగా జనసేన పార్టీ: నలిశెట్టి శ్రీధర్

ఆత్మకూర్ నియోజకవర్గ ఇంచార్జ్ నలిశెట్టి శ్రీధర్ సూచనల మేరకు అనంత సాగరం మండలం గౌరవరం గ్రామంలో జనసేన పార్టీ సీనియర్ నాయకులు శ్రీనివాస్ భరత్ ఆధ్వర్యంలో.. పొలాలు లేని కౌలు రైతులతో ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో రైతులు తమ ఇబ్బందులను ఆత్మకూర్ నియోజకవర్గ ఇంచార్జ్ శ్రీధర్ కు తెలియచేశారు, సమస్యలపై ఆయన సానుకూలంగా స్పందించి పరిస్కారం చేస్తాం అని హామీ ఇచ్చారు. సమావేశం అనంతరం రైతులు ఇంచార్జ్ శ్రీధర్ ను శాలువా కప్పి సన్మానించారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ బాద్యులు రవి ఉదయగిరి, ఉపాధ్యక్షుడు వెంకటేష్ ముదిరాజ్ ప్రధాన కార్యదర్శి వేణు గుడిపాటి, కౌలు రైతులు, మహిళలు, తదితరులు పాల్గొన్నారు.