అరెస్టులకు, గృహ నిర్బంధాలకి జనసేన పార్టీ భయపడదు

  • ప్రజాస్వామ్యానికి కట్టుబడి పోలీసు వారికీ ఎప్పుడూ సహకరిస్తూ ఉంటాం
  • రాజ్యాంగబద్ధంగానే జనసేన పోరాటం జరుగుతుంది
  • జనసేన పార్టీ పిడుగురాళ్ల మండల అధ్యక్షులు కామిశెట్టి రమేష్

జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మేయర్ కావటి మనోహర్ నాయుడు, క్షమాపణ చెప్పే దాకా వదిలిపెట్టం అని జనసేన పార్టీ పిడుగురాళ్ల మండల అధ్యక్షులు కామిశెట్టి రమేష్ పేర్కొన్నారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ సోమవారం రాష్ట్ర వ్యాప్త బంద్ సందర్భంగా గుంటూరు నగరంలో తెలుగు దేశం, జనసేన పార్టీల ఆధ్వర్యంలో నిరసనలు చేపట్టిన విషయం అందరికి విధీతమే. అయితే ఈ సందర్భంగా గుంటూరు నగర మేయర్ కావటి మనోహర్ నాయుడు, గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే మద్దాలి గిరి, అధికార పార్టీ అనే మదంతో బంద్ ను నిర్వీర్యం చేసేందుకు విఫలయత్నం చేసారని. వారు ఎంత ప్రయత్నించినా ఇరు పార్టీల మద్దతుతో ప్రజలు స్వచ్ఛందంగా బంద్ పాటిస్తున్న తరుణంలో అది జీర్ణించుకోలేక గుంటూరు మేయర్ కావటి మనోహర్ నాయుడు జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారిపై దుర్భాషలు ఆడడం మొదలు పెట్టారని అన్నారు. మీడియా సమావేశంలో కూడా తానొక మేయర్ అనే విషయాన్నీ కూడా మర్చిపోయి ప్రతిపక్ష పార్టీ అధినాయకుడు అనే మర్యాద కూడా లేకుండా విచక్షణ మర్చి, శ్రీ పవన్ కళ్యాణ్ గారి పుట్టుకలు గురించి మాట్లాడటం దుర్మార్గమని రమేష్ అన్నారు. గుంటూరు ఎస్పీ గారు వెంటనే కావటి మనోహర్ నాయుడు మీద సుమోటోగా కేసు ఫైల్ చేసి ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని, లేనిపక్షంలో జనసేన పార్టీ తరపున మా నాయకులు సుప్రీంకోర్టుకు వెళ్తారని తెలియజేశారని, జిల్లా సంయుక్త కార్యదర్శి దూదేకుల కాసిం సైదా అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రోగ్రాం కమిటీ సభ్యులు దూదేకుల సలీం, పిడుగురాళ్ల మండల ఉపాధ్యక్షులు బయ్యవరపు రమేష్, బేతంచెర్ల ప్రసాద్, జానపాడు గ్రామ అధ్యక్షులు పసుపులేటి నరసింహారావు, మండల ప్రధాన కార్యదర్శి గుర్రం కోటేశ్వరరావు, ఆవుల రమేష్, కార్యదర్శి కంభంపాటి ముక్కంటి, దీకొండ కిరణ్, నాగేశ్వరరావు మొదలగువారు పాల్గొన్నారు.