జనసేన పార్టీ నిరుపేద ప్రజలకు భద్రత

  • జనసేన పార్టీ పెద్దమందడి మండల అధ్యక్షులు కొమ్ము అనిల్

తెలంగాణ, వనపర్తి నియోజకవర్గంలో జనసేన పార్టీకి రోజురోజుకు ఆదరణ పెరుగుతుందని, పవన్ కళ్యాణ్ సారధ్యంలో నడవడానికి యువత, మహిళలు ముందుకొస్తున్నారని వనపర్తి కో-ఆర్డినేటర్ ముకుంద నాయుడు ఆదేశాల మేరకు పెద్దమందడి మండలకేంద్రంలో జనసేన క్రియాశీలక సభ్యత్వ నమోదు కిట్ ఐడీ కార్డులను అందించామని మండల అధ్యక్షులు కొమ్ము అనిల్ అన్నారు. ఈ సందర్భంగా కొమ్ము అనిల్ మాట్లాడుతూ యువకులు జనసేన పార్టీలో చేరడానికి ఉత్సాహం చూపిస్తున్నారని, నియోజకవర్గంలో జనసేన పార్టీని బలోపితం చేసి ఈ ఎన్నికలో జనసేన సత్తా చాటుతామని అన్నారు. నియోజకవర్గంలోని ప్రతి గ్రామం, ప్రతి గడపకు తిరిగి జనసేన పార్టీ గురించి వివరిస్తామన్నారు. అనంతరం జనసేన పార్టీ మండల ముఖ్య నాయకులతో గ్రామ స్ధాయిలో ఎన్నికల సన్నద్ధం గురించి బూత్ స్థాయిలో బలోపేతం గురించి సమావేశం నిర్వచించారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు కొమ్ము అనిల్ ముఖ్య నాయకులు భరత్, మహేష్, చరణ్, భాను, కార్తిక్, నాని, అశోక్, రాజు తదితరులు పాల్గొన్నారు.