జనసేనపార్టీ కువైట్ ఆధ్వర్యంలో ఈ నెల 14వ తేదీన జరిగే జనసేనపార్టీ 12వ ఆవిర్భావ దినోత్సవ సభను పురస్కరించుకుని శనివారం జనసేనపార్టీ కువైట్ సభ్యులు అందరూ కలిసి ఛలో పిఠాపురం పోస్టర్ ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ కార్యక్రమం ద్వారా జనసేన అధినేత మొదటిసారి గెలిచి డిప్యూటి ముఖ్యమంత్రి హోదాలో జరుపుకుంటున్న మొదటి ఆవిర్భావ దినోత్సవం వేడకలు సందర్భంగా జనసేన క్యాడర్ మొత్తం కాలర్ ఎగరేసి పండుగ జరుపుకోవాలని దశాబ్దం యుద్ధం చేసాం – శతాబ్దం వినపడేలా దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జనసైనికులు, జనసేన అభిమానులు, కార్యకర్తలు, నాయకులు, వీరమహిళలు పెద్ద ఎత్తున పాల్గొని అంగరంగ వైభవంగా జయప్రదం చేయాలని కోరుతున్నామని తెలిపారు.
Share this content:
Post Comment