జనసేన పార్టీ కౌలు రైతు భరోసా యాత్ర – పోస్టర్ ఆవిష్కరణ

జగ్గయ్యపేట, జనసేన పార్టీ కౌలు రైతు భరోసా యాత్ర సందర్బంగా జగ్గయ్యపేట జనసేన ఆధ్వర్యంలో పట్టణంలో స్థానిక బస్టాండ్ సెంటర్ నందు కౌలు రైతు భరోసా పోస్టర్ ను ఆవిష్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కృష్ణా జిల్లా ప్రధాన కార్యదర్శి బాడీసా మురళీకృష్ణ, జిల్లా సంయుక్త కార్యదర్శి ఈమని కిషోర్ కుమార్ పాల్గొని మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రైతాంగానికి పవన్ కళ్యాణ్ ముపై కోట్ల రూపాయలతో మూడు వేల మంది రైతులకు ఆర్థిక సహాయం అందించబోతున్నారని కౌలు రైతులను ఆదుకోవాలనే ఉద్దేశంతో తెలుగువారి నూతన సంవత్సరం ఉగాది రోజున పవన్ కళ్యాణ్ చనిపోయిన కౌలు రైతు కుటుంబానికి లక్ష రూపాయలు ఆర్థిక సహాయం ప్రకటించారని రాష్ట్ర రైతుల పట్ల, వ్యవసాయం పట్ల పవన్ కళ్యాణ్ కి ఉన్న చిత్తశుద్ధిని తెలియజేస్తోందని ఇప్పటివరకు రైతే రాజు, రైతే దేశానికి వెన్నుముక అంటూ ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చే నాయకులనె చూసాం కానీ తన కష్టార్జితంతో చనిపోయిన రైతుల కుటుంబాలను ఆదుకోవడం అనే ఉద్దేశంతో ఎంతో ఉదార స్వభావంతో ముందుకు వచ్చిన మా నాయకుడు పవన్ కళ్యాణ్ ని ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ ప్రభుత్వం అధికారం చేపట్టిన తరువాత వ్యవసాయ రంగం కుదేలైందని వ్యవసాయ రంగానికి సరైన ప్రోత్సాహం లేక రైతులు ఇబ్బంది పడుతున్నారని వ్యవసాయరంగం తీవ్ర సంక్షోభంలోకి నెట్టి వేయబడిందని తెలిపారు ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి కౌలు రైతుల కుటుంబాలకు ఏడు లక్షల రూపాయల నష్ట పరిహారం అందించాలని మురళీకృష్ణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జగ్గయ్యపేట మండల అధ్యక్షులు తులసి బ్రహ్మం, పెనుగంచిప్రోలు మండల అధ్యక్షులు తునికపాటి శివ, జనసైనికులు గోపి, నాగయ్య, దేవా తదితరులు పాల్గొన్నారు.