జనసేన పార్టీ మంగళగిరి నూతన మండల కమిటీల ఏర్పాటు

జనసేన పార్టీ మంగళగిరి నియోజకవర్గం కమిటీ నియామకంలో భాగంగా మంగళగిరి మండల అధ్యక్షులు వాసా శ్రీనివాసరావు అధ్యక్షతన నియోజకవర్గ పార్టీ కార్యాలయంలో ఉదయం 11 గంటలకు మండల పార్టీ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జనసేన పార్టీ రాష్ట్ర చేనేత వికాస విభాగం చైర్మన్ మరియు మంగళగిరి నియోజకవర్గ ఇంచార్జి శ్రీ చిల్లపల్లి శ్రీనివాసరావు పాల్గొని మండల కమిటీలో పని చేయబోయే కార్యకర్తలకు దిశానిర్దేశం చేసి తదుపరి మంగళగిరి రూరల్ మండలంలో పార్టీ బలోపేతానికి బలంగా చేయాలని కోరారు. మరియు జనసేన పార్టీ కార్యకర్తలకు క్రియాశీలక సభ్యత్వం కల్పించి ఐదు లక్షల రూపాయల బీమా సౌకర్యం కల్పించిన ఏకైక పార్టీ జనసేన పార్టీ అని తెలియజేశారు. తదుపరి రాష్ట్ర కార్యదర్శి బేతపూడి విజయ శేఖర్ మాట్లాడుతూ పార్టీ కమిటీలలో దళితులకు, గిరిజనులకు అగ్రస్థానం కల్పిస్తున్న పార్టీ అధిష్టానానికి ధన్యవాదాలు తెలియజేశారు. రాబోయే ఎన్నికల్లో మంగళగిరి నియోజకవర్గంలో శ్రీ చిల్లపల్లి శ్రీనివాసరావు నాయకత్వంలో జనసేన పార్టీ గెలుపే లక్ష్యంగా అందరూ పని చేయాలని తెలియజేశారు. అలాగే జిల్లా కార్యదర్శి రావి రమా మాట్లాడుతూ జనసేన కమిటీలలో అన్ని వర్గాల వారికి సముచిత ప్రాధాన్యం కల్పిస్తున్నారని మరియు మహిళలకు సముచిత గౌరవం ఇస్తున్నారని తెలియజేశారు. మరియు మండల అధ్యక్షులు వాసా శ్రీనివాసరావు మాట్లాడుతూ నూతన మండల కమిటీ ఏర్పాటు చేస్తున్నామని కమిటీలో ఉండే నాయకులు నిజాయితీగా, నిస్వార్ధంగా పార్టీ కోసం పని చేయాలని కోరారు. సమావేశం అనంతరం నియోజకవర్గ ఇన్చార్జ్ శ్రీ చిల్లపల్లి శ్రీనివాసరావు నూతనంగా ఎన్నికైన మండల అధ్యక్షులకు, రాష్ట్ర కార్యదర్శి మరియు జిల్లా కార్యదర్శులకు శుభాకాంక్షలు తెలియజేసి శాలువాతో సత్కరించారు. చివరగా మండలం నుండి వచ్చిన వివిధ గ్రామాల నాయకులు, కార్యకర్తలు మాట్లాడుతూ పార్టీ నిర్మాణం కోసం బలంగా సమయం కేటాయించి ప్రజల్లోకి పార్టీని ముందుకు తీసుకెళ్తామని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర చేనేత కమిటీ ప్రధాన కార్యదర్శి శ్రీ పర్వతం మధు, దాసరి కిరణ్, విష్ణు మొలకల వకుళాదేవి, కట్టెపోగు నవీన్ కుమార్ మరియు మంగళగిరి మండలం జనసేన పార్టీ నాయకులు, వీరమహిళలు మరియు జనసైనికులు పాల్గొన్నారు.