జనసేన పార్టీ నూతన సంవత్సర క్యాలెండర్లు ఆవిష్కరించిన జనసైనికులు

✦నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన సాదిల్లి నాగభూషణ.

శ్రీ సత్యసాయి జిల్లా, పుట్టపర్తి నియోజకవర్గం, అమడగూరు మండలం, జనసేన పార్టీ 2023 నూతన సంవత్సర క్యాలెండర్లు ఆవిష్కరణ చేసి అమడగూరు మండల కేంద్రంలోని స్థానిక శ్రీ చౌడేశ్వరి దేవి అమ్మవారి ఆలయంలో జనసేన పార్టీ సాదిల్లి నాగభూషణ, జన సైనికుల ఆధ్వర్యంలో జనసేన పార్టీ నూతన సంవత్సర క్యాలెండర్లు ఆవిష్కరణ నిర్వహించారు. ఈ సందర్భంగా సాదిల్లి నాగభూషణ మాట్లాడుతూ… జనసేన పార్టీ తరుపున మండల ప్రజలకు, నాయకులకు, కార్యకర్తలకు, నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. మండల ప్రజలు అందరు ఆయురారోగ్యాలతో సిరి సంపదలతో సుఖంగా, సంతోషంగా ఉండాలని వారు ఆకాంక్షించారు. రెండు పార్టీలకు అవకాశం ఇచ్చారు. అదేవిధంగా జనసేన పార్టీ అధ్యక్షులు మా ప్రియతమ నేత పవన్ కళ్యాణ్ కి ప్రజలందరూ ఒక అవకాశం ఇవ్వాల్సిందిగా వారు పిలుపునిచ్చారు. అనంతరం జనసైనికులు మాట్లాడుతూ…జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం జై జనసేన జై పవన్ కళ్యాణ్ అనే నినాదాలు చేపట్టారు.