జనసేన పార్టీ బలోపేతానికి కృషి చేయాలి: నేమూరి శంకర్ గౌడ్

కూకట్ పల్లి నియోజకవర్గం: తెలంగాణ రాష్ట్ర ఇంచార్జి నేమూరి శంకర్ గౌడ్ కు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కూకట్‌పల్లి నియోజకవర్గ ఇన్చార్జిగా అదనపు భాద్యతలు అప్పగించారు. ఈ క్రమంలో రాబోయే ఎలక్షన్లో కూకట్‌పల్లి నియోజకవర్గం బలోపేతానికై, నూతన కార్యవర్గాన్ని నిర్మించుటకై శంకర్ గౌడ్ గురువారం కూకట్‌పల్లి జనసేన శ్రేణులతో సమావేశం నిర్వహించడం జరిగినది. ఈ సందర్భంగా నేమురి శంకర్ గౌడ్ మాట్లాడుతూ.. నియోజకవర్గంలో మన జనసేన పార్టీ యొక్క సిద్ధాంతాలని ఇంటింటికి వెళ్లి వివరించాలని, రాబోయే రోజుల్లో పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు, ప్రతి ఒక్క ప్రజానీకానికి చేర్చాలని, దీని కొరకై ప్రతి ఒక్క జనసైనికులు మరియు వీరమహిళలు కష్టపడి మన జనసేన పార్టీని బలోపేతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో కొల్లా శంకర్, మహేష్ నాగేంద్ర, వెంకటేశ్వరరావు, విష్ణు, సురేంద్ర, ఠాగూర్, పద్మ, శంకర్, సాయి మరియు జనసైనికులు, వీరమహిళలు పాల్గొన్నారు.