జనసేన పార్టీ శ్రీకాళహస్తి నియోజకవర్గం మీడియా సమావేశం

శ్రీకాళహస్తి పట్టణంలోని ప్రెస్స్ క్లబ్ నందు జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి శ్రీమతి వినుత కోటా మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది. పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ప్రారంభించిన క్రియాశీల సభ్యత్వం గ్రామ గ్రామాన పార్టీ కోసం పని చేస్తున్న ప్రతి కార్యకర్త తప్పక సభ్యత్వం తీసుకుని పార్టీ అధిష్టానం నుండి నేరుగా గుర్తింపు పొందాలని, ఈ సభ్యత్వం ద్వారా జనసేన పార్టీ వారి కుటుంబాలకి 5 లక్షల భీమా ద్వారా అండగా ఉంటుందని తెలియజేయడం జరిగింది. దేశంలో ఏ రాజకీయ పార్టీ చెయ్యని విధంగా జనసేన పార్టీ కార్యకర్త కోసం ఈ క్రియాశీల సభ్యత్వం ద్వారా బరోసా కల్పిస్తుందని, ఇది వరకే 50 కి పైన పార్టీ పిఏసి చైర్మన్ ద్వారా 5 లక్షల చెక్ ను భీమా పథకం ద్వారా అందించారనొ తెలిపారు. ప్రమాదవశాత్తు గాయపడితే ఇన్సూరెన్స్ ద్వారా మెడికల్ ఖర్చుల కొరకు 50 వేల వరకు ఇన్సూరెన్స్ ద్వారా అందిస్తారని తెలిపారు. ఎంతో ప్రతిష్ట గాంచిన శ్రీకాళహస్తి ఆలయానికి ఈ ప్రభుత్వం వచ్చి 3 సంవత్సరాలు గడుస్తున్నా… 3 వ శివరాత్రి వస్తున్నా ట్రస్ట్ బోర్డ్ ను నియమించక పోవడానికి గల కారణాలు ఈ శాసనసభ్యులు ప్రజలకు తెలియజేయాలని, గుడిని వ్యాపార కేంద్రంగా మర్చేశారని, శాసన సభ్యులకు శ్రీకాళహస్తి దేవాలయం ఏటిఎం లా వాడుకుంటున్నారని, ప్రతి రోజూ 2 నుండి 5 లక్షల వరకు శాసనసభ్యులకు అనధికారికంగా గుడిలో అనేక రకాల పూజల ద్వారా సేకరించి పంపుతున్నట్లు విశ్వసనీయ సమాచారం ఉందని తెలిపారు. గుడిలో పూజారుల నుండి, కింది స్థాయి వరకు పని చేసే వారు అక్కడ జరిగే దోపిడీలపై నోరు మెదపలేని పరిస్థితులలో ఉన్నారని తెలిపారు. అధికారంలోకి వచ్చిన వెంటనే బోర్డ్ ఏర్పాటు చేసినట్టయితే 2 దఫాలుగా ఎక్కువ మందికి అవకాశం కల్పించి ఉండవచ్చని, ఇతరులకు అవకాశం ఇస్తే గుడిపై పెత్తనం చెయ్యి జారుతుందనే అభద్రతాభావంతో ఉన్నారా అని, సొంత పార్టీ నాయకులకే ట్రస్ట్ బోర్డ్ లో అవకాశం కల్పించి న్యాయం చెయ్యలేక పోతున్నారని, ఇంకా ప్రజల ఆర్తనాదాలు వీరికి ఎలా వినిపిస్తాయి అని ఆరోపించారు. త్వరిత గతిన ట్రస్ట్ బోర్డ్ ను ఏర్పాటు చేసి, గుడిలో జరిగే దోపిడీలకు , అనధికార లావా దేవీలను ఆపాలని జనసేన పార్టీ తరఫున డిమాండ్ చెయ్యడం జరిగింది. ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తి పట్టణ అధ్యక్షులు భవానీ శంకర్, నాయకులు మణికంఠ, కరీం, రవికుమార్ రెడ్డి, ప్రమోద్, సురేష్, తేజా, రఫీ, సలీం, గిరీష్, చందు చౌదరి పాల్గొన్నారు.