దివ్యాంగుల అందరికీ జనసేన పార్టీ అండగా ఉంటుంది

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గం మలికిపురం సెంటర్ లో శుక్రవారం జన చైతన్య దివ్యంగుల జాయింట్ యాక్షన్ కమిటీ వారు చేస్తున్న ధర్నాలో రాజోలు జనసేన నాయకులు పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా రాజేశ్వరరావు బొంతు, ఆయన మాట్లాడుతూ ఈ జగన్ రెడ్డి ప్రభుత్వంలో దివ్యాంగ సోదరీ సోదరీమణులందరికీ ఏ విధమైన న్యాయం జరగలేదని చెప్పవచ్చు. ప్రపంచంలో రాజకీయ నీతి నిజాయితీ కలిగిన ఏకైక నాయకుడు, దయ హృదయంతో తన సొంత డబ్బులతో న్యాయం చేస్తున్న నాయకుడు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ దృష్టికి మీ న్యాయ సమస్యలు తీసుకు వెళ్లడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారిని రాబోయే రోజుల్లో అందరి సమస్యలు తీరాలంటే తప్పనిసరిగా పవన్ కళ్యాణ్ ని సీఎం గా చేసుకునే దిశగా ముందుకెళ్లాలి. మీ అందరికి న్యాయం జరిగే వరకు ఈ పోరాటం ఆగకుండా ముందుకు సాగాలి. మీకు తోడుగా చివరి వరకు మీకు జనసేన పార్టీ అండగా ఉంటుంది అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన టిడిపి పార్టీ సమన్వయకర్త గుండుబోగుల పెద్దకాపు, టీడీపీ ఇంచార్జ్ గొల్లపల్లి సూర్యారావు, రాష్ట్ర కార్యదర్శి గెడ్డం మహాలక్ష్మి ప్రసాద్, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి తాడి మోహన్, టీడీపీ ఎంపిపి కేతా శ్రీనివాస్, యెనుముల వెంకటపతిరాజు, సఖినేటిపల్లి మండల అధ్యక్షులు గుబ్బల పణి కుమార్, బుజ్జి, రంగరాజు, కాండ్రేగుల వెంకటేశ్వర రావు, ముప్పర్తి నాని ప్రసాద్, వీరా వెంకట్, జనసేన నాయకులు, జనసైనికులు పాల్గొన్నారు.