అంగన్వాడి టీచర్లకు అండగా జనసేన పార్టీ

విశాఖ జిల్లా లో ఉన్న సుమారు 5600 అంగన్వాడీ కేంద్రలో విధులు నిర్వహిస్తున్న టీచర్లు మరియు అంగన్వాడీ ఆయమ్మల కు కనీస గౌరవ వేతనం పెంచాలని చాలీచాలని జీతాలతో దయానిక స్థితిలో ఉన్నారు అని వారికి అండగా జనసేన పార్టీ వుంటుంది అని జనసేన పార్టీ భీమిలి నియోజకవర్గ ఇన్చార్జ్ డాక్టర్ సందీప్ పంచకర్ల అన్నారు. డా సందీప్ పంచకర్ల మాట్లాడుతూ మీ వైసీపీ ప్రభుత్వం సలహాదారుల పేర్లతో లక్షల లక్షలు జీతాలుగా ఇస్తున్నారని వీరికన్నా ఫీల్డ్ లో తిరిగే మా ఆడపడుచు లకు కనీస వేతనం లేక అనేక ఇబ్బందులు పడుతున్నా మీకు కనిపించడం లేదా అని ఆవేదన వ్యక్తం చేశారు. జనసేన పార్టీ భీమిలి నియోజకవర్గ మహిళా నాయకురాలు ఒమ్మిదేవి యాదవ్ మాట్లాడుతూ ఈరోజు కొన్ని అంగన్వాడీ కేంద్రాలు అద్దె కట్టలేని పరిస్థితుల్లో ఉన్నాయని వర్షానికి తడుస్తూ ఎండకు ఎండుతూ అనేక కేంద్రాల్లో బాలింతలు చిన్నపిల్లలు అనేక ఇబ్బందులు పడుతున్నారని మూడు నెలలు అవుతున్నా సరే ఈరోజుకి జీతాలు ఇవ్వకపోవడం ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి ఏంటో అర్థమవుతుందని కనీస వసతులు కూడా కల్పించలేనటువంటి ఈ సీఎం కి ఎన్నికలు వస్తే మొదట గుర్తుకు వచ్చేది మాత్రం అంగన్వాడీ టీచర్లు అని దేవి యాదవ్ అన్నారు. 6-2-2023 తేదీన విశాఖ జిల్లా కలెక్టర్ ఆఫీస్ నందు అంగన్వాడి టీచర్లు వర్కర్లు చేస్తున్నటువంటి ధర్నాకి జనసేన పార్టీ తరఫున పూర్తి మద్దతు తెలియజేస్తాం అని తెలియజేశారు.