జనసేన పార్టీ తెలంగాణ విద్యార్ధుల ఆత్మీయ సమావేశం

ఉమ్మడి ఖమ్మం జిల్లా జనసేన పార్టీ విద్యార్థి విభాగం కోఆర్డినేటర్స్, ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ ఆధ్వర్యంలో ఖమ్మం జిల్లాలో ఉన్న వివిధ కళాశాలల్లో ఉన్న విద్యార్థి నాయకులతో కలిసి కమిటీల గురించి మరియు రాబోయే రోజుల్లో జనసేన పార్టీనీ బలోపేతం చేయటం గురించి ఉమ్మడి ఖమ్మం జిల్లా జనసేన పార్టీ విద్యార్థి విభాగ కోఆర్డినేటర్ తుమ్మల పూడి గంగాధర్, మరియు మిగతా నాయకులు మాట్లాడటం జరుగుతుంది. ది.29-5-2022, ఆదివారం రోజున 7గంటలకు ఉమ్మడి ఖమ్మం జిల్లా విద్యార్థి విభాగం కమిటీ ఆధ్వర్యంలో విద్యార్థులతో గూగుల్ మీట్ లో ఆత్మీయ సమావేశం కలదు. కావున ప్రతి ఒక్క విద్యార్థి ఈ మీటింగులో పాల్గొనాలని కోరుతున్నానని ఉమ్మడి ఖమ్మం జిల్లా విద్యార్థి విభాగ కార్య నిర్వాహక సభ్యులు గంధం ఆనంద్ అన్నారు.