నరవ గ్రామంలో అంగరంగ వైభవంగా జనసేన పార్టీ 10వ ఆవిర్భావ దినోత్సవ సంబరాలు

జనసేన పార్టీ 10వ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా పెందుర్తి నియోజకవర్గ, 88 వార్డ్, నరవ గ్రామంలో స్థానిక నాయకులు వబ్బిన జనార్దన్ శ్రీకాంత్ ఆధ్వర్యంలో జనసేన జెండా వందనం, కేక్ కటింగ్, బ్లడ్ డొనేషన్ క్యాంప్, ఐ డొనేషన్ క్యాంప్, ఐ చెకప్ వంటి కార్యక్రమాల తో అంగరంగ వైభవంగా జరిగాయి. స్థానిక నాయకులు వబ్బిన జనార్దన్ శ్రీకాంత్ మాట్లాడుతూ ఈ యొక్క కార్యక్రమానికి పిలవగానే ముఖ్యఅతిథిగా విచ్చేసిన గవర సోమశేఖర్ కి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ఈరోజు ముఖ్య అతిగా పిలవడానికి కారణం ఆయన జనసేన పార్టీకి కష్టపడడం అని, మన జిల్లాలోనే 1200 పైచిలుకు క్రియాశీలక సభ్యత్వాలు చేయించి జనసేన పార్టీకి నిరంతరం కష్టపడుతున్నారని, ప్రతి ఏటా జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ ముందు వచ్చే ఆదివారం మా నరవ రామాలయం చేసిన వద్ద 88వ వార్డు జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఈ సంబరాలు జరుపుకోవడం ఆనవాయితీగా వచ్చిందని, దాంట్లో భాగంగా ఆదివారం తాసుబిల్లి ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో బ్లడ్ డొనేషన్ క్యాంప్, ప్రౌఢస్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కంటి పరీక్షలు మరియు ఐ డొనేషన్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగిందని, సుమారు 50 పైచిలుకు యువతీ యువకులు డొనేషన్ లో పాల్గొన్నారు వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు, ఐ చెకప్ కూడా వందల సంఖ్యలో ప్రజలు కంటి పరీక్షలు చేయించుకున్నారని, ముఖ్యంగా నరవ గ్రామంలో అత్యధిక క్రియాశీలక సభ్యత్వాలు చేయించిన దాంట్లో ప్రతి ఒక్కరి కష్టం ఉందని అందులో భాగంగా ముఖ్యంగా ఒకరికి మనం ఈ టైంలో గౌరవించుకోవాల్సిన అవసరం ఉందని కొత్తగా పార్టీలోకి వచ్చి పవన్ కళ్యాణ్ భావజాలంతో పనిచేస్తూ నిరంతరం సమస్యలపై యుద్ధం చేస్తూ ఈరోజు సుమారు 60 పైచిలుకు క్రియాశీలక సభ్యత్వాలు చేసిన రాడి పెంటరావు కి ప్రత్యేక ధన్యవాదాలు, తప్పకుండా జనసేన పార్టీని ప్రజలందరూ ఆశీర్వదిస్తున్నారని దాని నిదర్శనమే రాష్ట్రంలో క్రియాశీలక సంఖ్య పెరగడం అని, నరవగ్రామం మరి 88 వ వార్డులో జనసేన పార్టీకి పనిచేస్తున్న ప్రతి ఒక్కరికి ఈ సందర్భం గా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అని మాట్లాడడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా గాజువాక నియోజవర్గ నాయకులు గవర సోమశేఖర్ పాల్గొని కేక్ కట్ చేసి, అధ్యక్షులు పవన్ కళ్యాణ్ భావజాలానికి ఆకర్షితులైన శ్రీమతి అక్కిరెడ్డి వెంకటరత్నంని కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించి, బ్లడ్ డొనేషన్ చేసిన దాతలకు సర్టిఫికెట్లు ఇచ్చి వారిని అభినందించి, ఈ నరవ గ్రామానికి నాకు చాలా సంబంధం ఉందని నా సొంత ఊరు ఈ గ్రామం కావున ఈ గ్రామం పైన నాకు ఎప్పుడూ ప్రేమ ఉంటుందని, ఈ గ్రామంలో జనసేన పార్టీ జనసేన పార్టీ అభివృద్ధి చెందుతుందని, దీన్ని నడిపిస్తున్న ప్రతి జనసైనికుడికి ప్రత్యేక ధన్యవాదాలు ఈరోజు ఆంధ్ర రాష్ట్రానికి జనసేన పార్టీ అవసరం ఉందని, జగన్ రెడ్డి నుంచి రాష్ట్రాన్ని కాపాడాలంటే ఒక్క మన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అవ్వడమే మార్గమని తప్పకుండా మనమందరం కష్టపడి జనసేన పార్టీని గెలిపించుకోవాలని పిలుపునివ్వడం జరిగింది. స్థానిక నాయకులు గళ్ళ శ్రీనివాసరావు మాట్లాడుతూ తక్కువ సమయంలోనే ఎంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన నరవ జన సైనికులకు ప్రత్యేక ధన్యవాదాలు, క్రియాశీలక సభ్యత్వం చేసుకున్న ప్రతి కుటుంబానికి కూడా జనసేన పార్టీ అండగా ఉంటుంది వారందరికీ కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానని ప్రజలందరికీ జనసేన పార్టీ 10వ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. ఈ సందర్భంగా తాసుబల్లి ఫౌండేషన్ శంకర్ నాయుడు గారికి మరియు వారి టీం కి, ప్రౌడస్ చారిటబుల్ ట్రస్ట్ జావిద్ కి, వీర మహిళ గా ముందు వచ్చి రక్తదానం చేసిన మల్ల శాలిని కి, వివాహ దినోత్సవ సందర్భంగా రక్తదానం చేసిన సూర్య దంపతులకు, ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటుచేసిన స్థానిక నాయకులు వబ్బిన జనార్దన్ శ్రీకాంత్ కి సన్మానం చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో జరిపోతులపాలెం నాయకులు సాలాపు కనకరాజు సాలాపు అప్పారావు, 88 వార్డ్ నాయకులు గోపి, ప్రసాద్, తేజ, రూపేష్, గవర శ్రీను, బొడ్డు నాయుడు, కార్తిక్, రాడి పెంటారావు, గంగు నాయుడు, ప్రవీణ్, నవీన్, లింగం రమేష్, మరియు జన సైనికులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.