గోపాలపురంలో దిగ్విజయంగా జనసేన పార్టీ 11వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

పార్వతీపురం నియోజకవర్గ జనసేన పార్టీ మండల అధ్యక్షురాలు ఆగురుమని అధ్యక్షతన అలాగే ఉమ్మడి జిల్లా కార్యక్రమాల నిర్వహణ కార్యదర్శి చిట్లు గణేశ్వరరావు, పాలీల మన్మధరావు ఆధ్వర్యంలో జనసేన పార్టీ 11వ ఆవిర్భావ దినోత్సవం పార్వతీపురం మండలం గోపాలపురం గ్రామంలో చేయడం జరిగింది. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకోవడం జరిగింది. తదనంతరం జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ మనోగతం పుస్తకాలు మరియు జనసేన పార్టీ చేతి బ్యాగ్స్ అందజేయడం జరిగింది అలాగే ఈ యొక్క పర్వదినాన జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వం చెట్ల ఇట్లు పంపిణీ చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి జనసేన పార్టీ వీర మహిళ బోనెల గోవిందమ్మ, జనసేన పార్టీ జిల్లా నాయకులు ఖాతా విశ్వేశ్వరరావు, అన్న బత్తుల దుర్గాప్రసాద్, అక్కన భాస్కరరావు, గుంట్రెడ్డి గౌరీ శంకర్, రాజన్న బాలు, కనకరాజు, కర్రి మణికంఠ, జనార్దన్ రావు, నవీన్, శరత్, సాయి,జనసేన పార్టీ కార్యకర్తలు జనసేన పార్టీ నాయకులు వీర మహిళలు తదితరులు పాల్గొన్నారు. అలాగే టిడిపి నాయకులు డోలు శివ పాల్గొనడం జరిగింది గోపాలపురం గ్రామ ప్రజలు పాల్గొనడం జరిగింది.