పెందుర్తి నియోజకవర్గం, 88 వార్డ్, నరవ గ్రామం, హైస్కూల్ జంక్షన్ వద్ద జనసేన పార్టీ ఆధ్వర్యంలో చలివేంద్రం ప్రారంభోత్సవం చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న వార్డు అధ్యక్షులు వబ్బిన జనార్దన శ్రీకాంత్ మీడియాతో మాట్లాడుతూ ప్రతి సంవత్సరం జనసేన పార్టీ ఆధ్వర్యంలో వేసవి కాలంలో ఈ హైస్కూల్ జంక్షన్ వద్ద చలివేంద్రం డొక్కా సీతమ్మ పేరు మీద జనసేన పార్టీ అధ్యక్షులు ఆంధ్ర రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు స్ఫూర్తితో ఏర్పాటు చేయడం జరుగుతుందని, ఈ చలివేంద్రం వీర మహిళలు చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేయడం మరియు ఈరోజు శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది పర్వదినాన్న ప్రారంభోత్సవం చేయడం చాలా శుభ సూచకమని, వార్డు ప్రజలందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ, చలివేంద్రంతోపాటు స్వాతంత్ర సమరయోధులుభగత్ సింగ్ పేరు మీద బస్సు షెల్టర్, మరియు ఈ భూమ్మీద మానవాళితోపాటు మూగజీవులకు కూడా బ్రతికే హక్కు ను దృష్టిలో పెట్టుకొని ఈ సంవత్సరం వేడి తీవ్రతకు నీటి నిలువలు తగ్గడం వల్ల మూగజీవులకు ఉదాహరణకు పక్షులకు కుక్కలకు కూడా ఈ చలివేంద్రంలో ప్రత్యేకంగా నీరు అందుబాటులో ఉంచడం హర్షించదగ్గ విషయమని కొనియాడారు, ఇదేవిధంగా పత్రికా ముఖంగా వీక్షిస్తున్న ప్రజలందరూ కూడా మీ పరిసరాలలో మూగజీవులకు నీటిని అందుబాటులో ఈ వేసవి కాలంలో ఉంచాలని కోరడం జరిగింది. అనంతరం ఉగాది పచ్చడిని అందరికీ పంచి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో వీర మహిళలు ప్రియా, స్వాతి జనసేన పార్టీ సీనియర్ నాయకులు గల్లా శ్రీనివాస్, లింగం వాసు, చిన్నారావు,గవర అప్పలరాజు, చిన్నారావు, సాలాపు శంకర్రావు, ప్రవీణ్, నవీన్, సంతోష్, వమ్మి అప్పలరాజు, తేజ, సంతోష్, మరియు జనసైనికులు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
Share this content:
Post Comment