ఎస్.కోట, కొత్తవలసలో జనసేన పార్టీ ఆవిర్భావ సభ పోస్టర్ ఆవిష్కరణ శనివారం ఎం.కే.విలాస్ హాల్లో జరిగింది. కొత్తవలస మండల పార్టీ అద్యక్షులు గొరపల్లి రవికుమార్, వేపాడ మండలం పార్టీ అద్యక్షులు సుంకర అప్పారావు ఆధ్వర్యములో జరిగిన జనసేన పార్టీ 12వ ఆవిర్భావ సభ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎస్.కోట నియోజకవర్గ జనసేన సీనియర్ నాయకులు వబ్బిన సన్యాసి నాయుడు పార్టీ సభ్యుల నుద్దేశించి ప్రసంగిస్తూ ఈ నెల 14 న పిఠాపురంలో జరుగుతున్న ఆవిర్భావ సభలో ప్రజా సమస్యలపైన, పార్టీ నిర్మాణముపైన, పార్టీ భవిష్యత్ ప్రణాళిక పైన, తీర్మానాలు చేసి ప్రకటించడం జరుగుతుందని. 100శాతం స్ట్రైక్ రేట్ తో 21 మంది ఎంఎల్ఏ లను, కూటమిని గెలిపించుకుని ఉప ముఖ్యమంత్రి పదవిని చేపట్టిన పవన కళ్యాణ్ పార్టీనీ బలోపేతం చేయడానికి ఆవిర్భావ సభను జయప్రదం చేయడం ఎంతో కీలకమని అన్నారు. కావున నియోజకవర్గంలో ఉన్న పార్టీ సభ్యులు, మెగా అభిమానుల, వీర మహిళలు, ప్రజలు పెద్దయెత్తున, ఆవిర్భావసభకు తరలివచ్చి జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు, జనసైనికులు హాజరయ్యారు.
Share this content:
Post Comment