భారతరత్న మాజీ ప్రధానమంత్రి స్వర్గీయ వాజపేయికి నివాళులర్పించిన జనసేన

పార్వతీపురం మన్యం జిల్లా, పాలకొండ నియోజకవర్గం, వీరఘట్టం మండలం. వీరఘట్టం మండల కేంద్రంలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో దివంగత మహానేత, మాజీ ప్రధానమంత్రి స్వర్గీయ శ్రీ అటల్ బిహారీ వాజపేయి వర్ధంతి జనసేన పార్టీ నాయకులు మత్స పుండరీకం, జనసేన జాని పువ్వులు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జనసేన జాని మాట్లాడుతూ… పేద, బడుగు, బలహీన వర్గాలకు ఆశాజ్యోతి, ఆధునిక భారతవానికి విశిష్ట సేవలందించిన మహామనిషి మాజీ ప్రధానమంత్రి స్వర్గీయ వాజపేయి దేశాభివృద్ధిలో విశిష్ట సేవలందించిన మహనీయునికి జనసేన పార్టీ తరుపున పుష్పాంజలి ఘటిస్తున్నామని అన్నారు. జనసేన నాయకులు మత్స పుండరీకం మాట్లాడుతూ… భారతరత్న, మాజీ ప్రధానమంత్రి స్వర్గీయ అటల్ బిహారీ వాజపేయి పాలనలో టెలికాం, సూక్ష్మ సేద్యం, స్వర్ణ చతుర్బుజి ప్రాజెక్ట్, గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్ట్ లు, ఫోఖ్రాన్ అణు పరీక్షలు, కార్గిల్ విజయం ఇలా మరెన్నో ప్రపంచ దేశాలకు భారతదేశం సత్తాను చాటి చెప్పిన మహావ్యక్తి వాజపేయి. ఆజాధీ కా అమృత్ మహోత్సవ వేళలో తలుచుకోవలసిన గొప్ప దేశ భక్తుడు, భారతరత్న, మాజీ ప్రధానమంత్రి, స్వర్గీయ అటల్ బిహారి వాజపేయి స్మృతికి జనసేన పార్టీ తరుపున నివాళులు అర్పిస్తున్నామని తెలిపారు.