*’చాయ్ విత్ జనసైనిక్స్’ లో స్పూర్తిదాయక వేడుకలు
నెల్లూరు: జనసేన పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘చాయ్ విత్ జనసైనిక్స్’ కార్యక్రమం 12వ రోజు ఉత్సాహంగా సాగింది. ఈ సందర్భంగా 13వ డివిజన్ జనసేన నాయకులు పేనేటి శ్రీకాంత్, సీనియర్ నేత నూనె మల్లికార్జున యాదవ్, జిల్లా ప్రధాన కార్యదర్శి కిషోర్ గునుకుల, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి సుందర్ రామిరెడ్డి, జిల్లా కార్యాలయ ఇంచార్జ్ జమీర్ తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వంగవీటి మోహనరంగా, అల్లూరి సీతారామరాజు, పింగళి వెంకయ్య ల వర్ధంతిని పురస్కరించుకుని ఘనంగా నివాళులు అర్పించారు. బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి వంగవీటి రంగా త్యాగం, బ్రిటిష్ పాలనను తుడిచిపెట్టిన విప్లవ వీరుడు అల్లూరి పోరాట స్ఫూర్తి, భారత జాతీయ పతాక రూపకర్త పింగళి వెంకయ్య స్మరణతో కార్యక్రమం ఉత్తేజభరితంగా సాగింది. జాతీయ మీడియా ప్రతినిధి, టిడ్కో చైర్మన్ వేములపాటి అజయ్ గారి సూచనలతో సాగుతున్న ఈ కార్యక్రమం ప్రజల్లో చైతన్యం నింపుతోంది. నెల్లూరు బైపాస్, సింహపురి హాస్పిటల్ సెంటర్, యనమల వారి దిన్నెలో నిర్వహించిన ఈ కార్యక్రమం జనసేన శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది.
Share this content:
Post Comment