విమాన ప్రమాద మృతులకు జనసేన నివాళి

అహ్మదాబాద్ ఎయిరిండియా విమాన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారికి జనసేన పార్టీ నెల్లూరు జిల్లా కార్యాలయంలో క్యాండిల్‌లతో నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో తిరుపతి జిల్లా జనసేన ఇంచార్జ్, హన్త కళా కార్పొరేషన్ చైర్మన్ డా. పసుపులేటి హరిప్రసాద్ నాయకత్వంలో పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ – ప్రమాదం తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించిందని, సాధారణ ప్రయాణికులతో పాటు మెడికో విద్యార్థులూ మృతిచెందడం మరింత విషాదకరం అని తెలిపారు. మృతుల ఆత్మలకు శాంతి చేకూరాలని కోరుతూ, వారి కుటుంబాలకు కూటమి ప్రభుత్వం భరోసాగా నిలుస్తుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి సుందర్ రామిరెడ్డి, సీనియర్ నాయకులు నూనె మల్లికార్జున యాదవ్, జమీర్, చంద్రశేఖర్ రెడ్డి, గుర్రం కిషోర్, ప్రశాంత్ గౌడ్, హేమచంద్ర యాదవ్, ఈగి సురేష్, సుధా మాధవ్, సందీప్, మనోజ్, అనుదీప్, ఉదయ్, కరీం, శ్రీకాంత్, వెంకట్ యాదవ్, పవన్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

Share this content:

Post Comment