జనసేన పింఛన్ కార్యక్రమం

కదిరి నియోజకవర్గం, బాలసముద్రం గ్రామంలో ఉన్న పేద వారిని గుర్తించి వారికి చిరు సాయంగా ప్రభుత్వం నుండి వారికి పింఛన్ వచ్చే వరకూ జనసేన పింఛన్ ఇవ్వడం జరుగుతుంది. ఈ పింఛన్ కార్యక్రమంలో రెడ్డెమ్మ, సాలెమ్మ, లక్ష్మమ్మ, కుల్లాయప్ప మరియు చాంద్ బాషా ఈ ఐదుగురికి 310 రూ..చొప్పున పింఛన్ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో శ్రీనాథ్, కాలేష, అనిల్, నవీన్, కిరణ్, వెంకీ, అర్షద్, మస్తాన్, సోము పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా జనసేనపార్టీ ఎం.పీ.టీ.సీ అమర్ కార్తికేయ మాట్లాడుతూ.. జనసేనపార్టీ సిద్ధాంతాలు, పవన్ కళ్యాణ్ ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్దాం మరియు ఆయన మనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలుపుకుందాం అని అన్నారు.