కార్తికేయ బ్యాంక్ డిపాజిట్ల అవకతవకలపై జనసేన వినతిపత్రం

కాకినాడ సిటి: జనసేన పార్టీ పి.ఏ.సి సభ్యులు & కాకినాడ సిటి ఇంచార్జ్ ముత్తా శశిధర్ సూచనలమేరకు జనసేన పార్టీ నాయకులు ఆకుల శ్రీనివాస్ ఆధ్వర్యంలో జిల్లా కో-ఆపరేటివ్ రిజిస్ట్రార్ కు కార్తికేయ కొ-ఆపరేటివ్ బ్యాంక్ డిపాజిట్ల అవకతవకలపై వినతిపత్రం ఇవ్వడం జరిగింది. గత కొద్దిరోజుల క్రిందట వెలుగులోకి వచ్చిన కార్తికేయ కొ-ఆపరేటివ్ బ్యాంక్ ద్వారా సేకరించిన డిపాజిట్ల విషయములో జరిగిన అవకతవకలు చట్టాలని పరిహసిస్తున్నాయన్నారు. ఈ బ్యాంక్ యాజమాన్యము పూర్తి దురుద్దేశముతో డిపాజిట్లను సేకరించి వాటిని దారిమళ్ళించి ఖాతాదారులను మోసం చేసిన విషయమై నగర ప్రజలు ఆందోళనకు జనసేన పార్టీ సంఘీభావం తెలుపుతోందన్నారు. కాకినాడ సిటి లాంటి ప్రశాంతమైన నగరంలో పెన్షనర్లు తమ రిటైర్మెంటు సెటిల్మెంటు మొత్తాలని డిపాజిట్ చేసుకుని ఆవచ్చే వడ్డీపై తమ జీవితాన్ని సాగించడం చేసుకునే నేపధ్యంలో, ఆ డిపాజిట్లు గల్లంతు జరిగితే వృద్ధాప్యంలో వారి పరిస్థితి అగమ్యగోచరం జరుగుతుంది, దీనివల్ల వారు అనారోగ్యం పాలు అవ్వడం, కొంతమంది భయాందోళనలవల్ల ఆత్మహత్యలకు ప్రేరేపింపబడితే దానికి ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నించారు. గతంలో జయలక్ష్మి కొ-ఆపరేటివ్ బ్యాంక్ వారు చేసిన అవకతవకలపై ఇప్పటివరకు ఈ వై.సి.పి ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టలేదనీ, ఇదేనా బాధితులపట్ల ప్రభుత్వం చూపే శ్రద్ధ అని నిరసించారు. ఇటువంటి ఆర్ధిక నేరగాళ్ళపై తీవ్ర చర్యలు తీసుకుని డిపాజిటర్ల సొమ్ముని వేగంగా తిరిగి ఇప్పించవలసినదిగా జనసేన పార్టీ తరపున డిమాండ్ చేస్తూ, డిపాజిటర్లతో సమావేశము నిర్వహించి వారికి ధైర్యం చెప్పి ప్రభుత్వం తరపున పూర్తి బాధ్యత తీసుకుని తగు సహాయ సహకారాలు అందించి న్యాయం చేయవలసినదిగా జనసేన పార్టీ తరపున డిమాండ్ చేసారు. ఇలాంటి నేరాలు, అవకతవకలు భవిష్యత్తులో పునరావృతం కాకుండా పటిష్టమైన చర్యలు తీసుకొనవలసిందిగా జనసేన పార్టీ తరపున కోరుతూ, డిపాజిటర్లకు న్యాయం జరిగేంతవరకు వారి తరపున పోరాటం చేస్తామని తెలియచేసారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి అట్ల సత్యన్నారాయణ, 39వ వార్డ్ అధ్యక్షుడు ఆకుల శ్రీనివాస్, 46వ వార్డ్ అధ్యక్షుడు తోట కుమార్, 35వ వార్డ్ అధ్యక్షుడు మనోహర్ లాల్ గుప్తా, జనసైనికులు సుంకర సురేష్ భగవాన్ అగ్రహారం సతీష్ తదితరులు పాల్గొన్నారు.