ప్రజా సమస్యలపై జనసేన వినతిపత్రం

  • ప్రజా సమస్యలే నాకు ముఖ్యం, పార్టీ కోసం కష్టపడే ప్రతి ఒక్కరికి ప్రాధాన్యత ఇస్తాను
  • పంచాయితీ కార్యదర్శికి వినతిపత్రం ఇచ్చిన కొండపి నియోజకవర్గం జనసేన నాయకులు

కొండపి నియోజకవర్గం: టంగుటూరు మండల కేంద్రంలో వాణినగర్ లో ఉన్నటువంటి ప్రధాన రహదారులకు ఇరువైపులా డ్రైనేజీ లేకపోవడం వలన, డ్రైనేజీలు ఉన్నచోట పూడికలు తీయించకపోవడం వలన, ఇటీవల కురిసిన వర్షాలకు రహదారులు పక్కన నీరు నిల్వ ఉండి, చెత్తతో నిండిన రహదారులు అస్తవ్యస్తంగా ఉన్నాయి. ఈ కారణంగా ప్రజలు అనారోగ్యానికి గురి అవుతున్నారు. గతంలో కూడా ప్రజలు అధికారులకి, వాలంటీర్ కి, వైసీపీ నాయకుల దృష్టికి ఈ సమస్యను తీసుకువెళ్లడం జరిగింది. ఎవరూ పట్టించుకున్న పాపాన పోలేదు. ఇకనైనా అధికారులు మేలుకుని ఈ వాణి నగర్ లో ఉన్నటువంటి ప్రధాన రహదారులకు ఇరువైపులా పూడికలు తీయించి, నీరు నిల్వ లేకుండా చేసి, బ్లీచింగ్ పౌడర్ చల్లి, ప్రజల ఆరోగ్యాన్ని కాపాడండి అంటూ కొండపి నియోజకవర్గం జనసేన పార్టీ సమన్వయకర్త కనపర్తి మనోజ్ కుమార్ శనివారం టంగుటూరు మండలం పంచాయితీ కార్యదర్శి ఎన్. జగదీష్ బాబుకు వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో టంగుటూరు మండలం ఉపాధ్యక్షులు మట్ట రమేష్, మండల యూత్ లీడర్ బడుగు నాగార్జున, బాబు, నాగరాజు, షారుక్, వంశీ, యశ్వంత్, నాగరాజ్, సురేష్ మరియు వాణినగర్ ప్రజలు పాల్గొన్నారు.