ఎర్ర నేల వీధి కాలనీ సమస్యలపై జనసేన వినతిపత్రం

అనంతపురం జిల్లా, కళ్యాణదుర్గం పట్టణంలో ఎర్ర నేల వీధి శ్రీకృష్ణ మందిరం నుంచి పాత బస్టాండ్ వరకు గల రోడ్డు అద్వాన స్థితిలో ఉంది. మురికి కాలువల నీరు రోడ్డు మీదకు ప్రవహిస్తూ, చెత్తాచెదారం పేరుకుపోయి పరిసర ప్రాంతమంతా అపరిశుభ్రంగా తయారైంది. కాలనీ వాసులు ఈ సమస్యను జనసేన దృష్టికి తీసుకొని రాగా.. ఆ కాలనీలో జనసేన నాయకులు పర్యటించి, కాలనీవాసులతో మాట్లాడి కాలువ పక్కన బ్లీచింగ్ పౌడర్ చల్లటం జరిగింది.. ఈ సందర్భంగా కాలనీవాసులు మాట్లాడుతూ గత 20 సంవత్సరాలుగా రోడ్డు లేక చాలా ఇబ్బందులకు గురి అవుతున్నామని, సరైన రోడ్డు, డ్రైనేజీ వ్యవస్త లేక పోవడం వలన వర్షాకాలంలో వర్షం నీరు పూర్తిగా ఇళ్లల్లోకి చేరి ఇబ్బందికి గురౌతున్నామని కాలనీవాసులు వాసులు తెలిపారు.. జనసేన నాయకులు సంబందిత సమస్యలపై కాలనీ వాసులతో సంతకాలు సేకరించి మున్సిపల్ ఆఫీస్ కి వెళ్లి సంబంధిత అధికారులకు ఈ సమస్య పరిష్కరించాలని జనసేన పార్టీ తరఫున వినతిపత్రం ఇవ్వడం జరిగింది. సమస్య పరిష్కరించకపోతే కాలనీవాసులతోపాటు మున్సిపల్ ఆఫీస్ దగ్గరికి వచ్చి జనసేన పార్టీ ఆధ్వర్యంలో ధర్నా చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నామని తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన జిల్లా కార్యదర్శి లక్ష్మీనరసయ్య సంయుక్త కార్యదర్శి బాల్యం రాజేష్ అనంతపురం పట్టణ అధ్యక్షులు చలపాడి రమేష్, వంశీ, జాకీర్, ముక్కన్న, దినేష్, వినయ్ మొదలైన జనసైనికులు పాల్గొనడం జరిగింది.