సెయింట్ జోసెఫ్ రోడ్ దుస్థితిపై జనసేన వినతి పత్రం

విశాఖ పశ్చిమ నియోజకవర్గం, ఇండస్ట్రియల్ బెల్ట్ సెయింట్ జోసెఫ్ రోడ్ అతి దయనీయ స్థితిలో ఉండడం చూసి పలుమార్లు వార్డు లో జనసైనికులు రోడ్డు మరమ్మత్తు పనులు చేపట్టడం, మళ్ళీ ఆ రోడ్డు అదే విధంగా పాడవడంతో ప్రయాణికులు తరచూ యాక్సిడెంట్స్ కు అవ్వడం జరుగుతుంది. ఈ క్రమంలో జనసేన పార్టీ 60వ వార్డు కార్పొరేటర్ అభ్యర్థి మొజ్జాడ చంద్ర మౌళి, మరియు జనసేన నాయకులు ముప్పిన ధర్మేంద్ర, ఆళ్ళ శ్రీకాంత్, యెళ్లపు పరమేశ్, వినయ్ సోమవారం జీ.వీ.ఎం.సీ పి రాజబాబు కమిషనర్ ను కలిసి మరమ్మత్తు పనులు త్వరగా చేయించాలని వినతి పత్రం ద్వారా కోరారు.