బోనకల్ ఎంపిడిఓ కి జనసేన వినతిపత్రం

మదిర, బోనకల్ మండలంలో అన్ని గ్రామ పంచాయతీలు పరిశుభ్రంగా ఉంచాలిని, వచ్చే సీజనల్ వ్యాధులను అరికట్టాలని బోనకల్ ఎంపీడీవోకి వినతిపత్రం అందించిన జనసేన మండల కమిటీ. ఈ సందర్భంగా బోనకల్ జనసేన పార్టీ మండల అధ్యక్షులు తాళ్లూరి డేవిడ్ మాట్లాడుతూ బోనకల్ మండలంలో సీజనల్ వ్యాధుల పట్ల వచ్చే దోమకాటుకు, మలేరియా, టైఫాయిడ్, విష జ్వరాలు, వల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, కావున బోనకల్ మండలం అన్ని గ్రామ పంచాయతీలలో దోమల, మందు, మరియు బ్లీచింగ్ పౌడర్, ఇళ్ల, పరిసరాలలో గల తడి చెత్త, గుంతలలో నిలువగల మురికి నీటిని మరియు అన్ని గ్రామ పంచాయతీలలో గ్రామ పరిశుభ్రంగా ఉండేలా తమ చర్యలు తీసుకోవాలని బోనకల్ జనసేన పార్టీ మండల కమిటీ తరఫున కోరుతున్నాం ప్రజల సమస్యల అట్లా ప్రజలకు అండగా జనసేన పార్టీ ఎప్పుడు ముందుండి పోరాడుతుందని, ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బోనకల్ మండల నాయకులు సజ్జనపు భరత్, ఎస్.కె జానీ పాషా, నరసింహశెట్టి నరేష్, మోదుగు పవన్ తదితరులు పాల్గొన్నారు.