నరసాపురం డి.ఎస్.పికి జనసేన వినతిపత్రం

నరసాపురం నియోజకవర్గంలో వైసీపీ గ్రామ వాలంటీర్లు, మున్సిపల్ కౌన్సిలర్లు మరియు కార్యకర్తలు కలిసి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ దిష్టి బొమ్మను దగ్ధం చేయడాన్ని ఖండిస్తూ జనసేన పార్టీ నర్సాపురం నియోజకవర్గ ఇన్చార్జ్ బొమ్మిడి నాయకర్ ఆదేశాల మేరకు నరసాపురం డి.ఎస్.పికి వినతిపత్రం అందజేసి వారి మీద తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. అనంతరం నరసాపురం అంబేడ్కర్ సెంటర్లో పవన్ కళ్యాణ్ చిత్రపటానికి నరసాపురం నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, జనసైనికులు, వీర మహిళలు పాలాభిషేకం చేయడం జరిగింది. ఈ సందర్భంగా జనసేన నాయకులు మాట్లాడుతూ జాతీయ రహదారులపై ఇలాంటి అసాంఘిక కార్యక్రమాలు చేయడం అప్రజాస్వామికంగా ఉందని మండిపడ్డారు. అలాగే జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఎవరి మనోభావాలను దెబ్బ తియ్యడానికి కాదు అని, అవి కొంతమంది వాలంటీర్ల పేరుతో చేస్తున్న కొంత మంది రౌడీ మూక గురించి ఆయన అలా ప్రస్తావించారని, వైసీపీ నాయకులు కావాలనే వాలంటీర్లను రెచ్చగొట్టి ఇలాంటి అసాంఘిక కార్యక్రమాలకు తెర లేపుతున్నారని అన్నారు. కావున ప్రజలు అందరూ అర్థం చేసుకుని ఈ రౌడీ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని అభిప్రాయ పడ్డారు. ఈ కార్యక్రమంలో చాగంటి మురళి కృష్ణ (చిన్నా), వలవల నాని, ఆకన చంద్రశేఖర్, ఆకుల వెంకటస్వామి, బందెల రవీంద్ర నిప్పులేటి తారకరామారావు, వాతాడి కనకరాజు, గంటా కృష్ణ, తోట అరుణ, పోలిశెట్టి నళిని, వలవల సావిత్రి, బొమ్మిడి కృష్ణమూర్తి, పోలిశెట్టి సాంబ, లక్కు బాబి, పోలిశెట్టి గనేశ్వరరావు, యడ్లపల్లి మహేష్, పులి భుజంగరావు, బల్ల హనుమంతు, అయితం చిన్ని, గణేష్న శ్రీరామ్, చెన్నంశెట్టి రాజీవ్, కొల్లు జయరాజు, రామవరపు శ్రీరామ్, దుసనపూడి సత్యనారాయణ మరియు నియోజకవర్గ జనసేన నాయకులు, జనసైనికులు, వీర మహిళలు తదితరులు పాల్గొన్నారు.