సత్తెనపల్లి మున్సిపల్ కమిషనర్ కు జనసేన వినతిపత్రం

సత్తెనపల్లి, పేదవారికి అందరికీ ఉచిత నివాస గృహాలు కల్పించే సాకుతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అతిపెద్ద భూదందాను చేపట్టిందని, ఇందులో అక్రమాలను వెలికి తీసి ప్రభుత్వ పెద్దల అవినీతి కుట్రను రట్టు చేస్తామని జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ అన్నారు. జనసేనాని పవన్ కళ్యాణ్ పిలుపుమేరకు చేపట్టిన సోషల్ ఆడిట్ కార్యక్రమంలో భాగంగా సోమవారం ఉదయం వారు జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావుతో కలిసి సత్తెనపల్లి పట్టణ మున్సిపల్ కమీషనర్ కు వినతిపత్రాన్ని అందించడం జరిగింది. సత్తెనపల్లి పట్టణ పరిధిలో టిడ్కో గృహాలు, జగనన్న కాలనీ గృహాలు మంజూరుకు ఎంతమంది లబ్దిదారులను ఎంపిక చేయడం జరిగింది, టిడ్కో గృహాల మంజూరుకు లబ్ధిదారుల నుండి ఎంతెంత ధరావత్తు వసూలు చేశారు, వారందరికీ నివాస గృహాలు కేటాయించారా, జగనన్న కాలనీల కోసం ఎంత మేరకు ప్రభుత్వ భూములను ఉపయోగించారు, ప్రైవేటు వ్యక్తుల నుండి ఎంత మొత్తంలో భూములను కొనుగోలు చేశారు, జగనన్న ఇల్లు ఎంతమందికి కేటాయించారు, ప్రస్తుతం సదరు టిడ్కో మరియు జగనన్న కాలనీల స్థితిగతులు ఏమిటి అను పలు ప్రశ్నలతో కూడిన సమాచారం కోరుతూ మున్సిపల్ కమిషనర్ కు వినతిపత్రం అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా అధికార ప్రతినిధి తవిటి భవన్నారాయన, సత్తెనపల్లి రూరల్ మండల పార్టీ అధ్యక్షులు నాదెండ్ల నాగేశ్వరరావు, వీర మహిళలు నామ పుష్పలత, తిరుమలశెట్టి మల్లీశ్వరి, జనసైనికులు తిరుమలశెట్టి సాంబశివరావు, సుబ్బు, నంద్యాల శ్రీకాంత్, రాట్నాల సోమశేఖర్, తిరుమల సాంబశివరావు, రాయుడు బాలకృష్ణ, ఆకుల శ్రీనివాసరావు, షేక్ ఖాజా, సిసింద్రీ, షేక్ జమాల్, శేషు, కొండలు, తమ్మిశెట్టి మహేష్, కూరాకుల మహేష్, రాజేష్ తదితరులు పాల్గొన్నారు.