రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలికి వినతిపత్రమిచ్చిన జనసేన

కాకినాడ సిటిలో ఇటీవల ఒక అభం శుభం తెలియని పాఠశాల విధ్యార్ధినిపై నిందితుడు పలుమార్లు అత్యాచారం జరిపి గర్భవతిని చేయడంపై జనసేన పార్టీ తీవ్రంగా నిరసనను తెలియచేస్తోంది. అసలు ఇటీవల బాలికలపై, మహిళలపై రాష్ట్రంలో జరుగుతున్న హత్యాచారాలు అంతేలేకుండా పోతున్నాయి. నేరగాళ్ళకు ప్రభుత్వమన్నా, పోలీసు వ్యవస్థ అన్నా కనీసం భయంలేకుండా పోతొందని ఈ సంఘటనలు నిరూపిస్తున్నాయి. ఈ విషయమై విచారించడానికి కాకినాడ సిటికి వచ్చిన రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలికి మా తీవ్రనిరసనని తెలియచేసాము. ఈ విషయంపై తక్షణమే చర్యలు తీసుకునేలా ఉపక్రమించమని తెలియచేస్తూ వినతిపత్రం అందచేయడం జరిగింది, లేనిపక్షంలో జనసేన పార్టీ తరపున ఆందోళనలను తీవ్రం చేస్తామని స్పష్టం చేసాము. దిశ యాప్ అని ఊదరగొట్టిన అధికార వ్యవస్థ మరి దాని ప్రయోజనాలు మహిళలకు తెలియచేయడంలో విఫలమైందా లెక అది కేవలం కన్నీళ్ళు తుడిచే ప్రయత్నమా అని ప్రశ్నిస్తున్నాము. ప్రకాశం జిల్లాలో నిందితుదికి ఉరి శిక్ష వేయించాము అని చెపుతున్న మీరు తక్షణమే ఇక్కడ ఇలాంటి దారుణం వడిగట్టిన దుర్మార్గుడిని ఉరి శిక్ష వేసి శిక్షించి ప్రభుత్వం మహిళలను రక్షించుతుందని నిరూపించుకోండి. బాధితురాలికి న్యాయం జరిగేవరకు ఆసరాగా చదువుకునేలా ఏర్పాటు చేసి, అనంతరం ఉద్యోగం ఇచ్చేలా గవర్న్మెంట్ అధికారికంగా ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నాము. అంతే కాకుండా తక్షణమే న్యాయ పరిహారం అందచేయాలని ఇందులో ఏమాత్రం ప్రభుత్వం విఫలమైనా లేక నిర్లక్షం వహించినా జనసేన పార్టీ పోరాటం చేసి బాధితురాలికి న్యాయం జరిగేవరకు విశ్రమించదని మీకు తెలియచేస్తున్నాము. ఈ కార్యక్రమంలో ఈ కార్యక్రమంలో జనసేనపార్టీ జిల్లా ఉపాధ్యక్షురాలు సుంకర కృష్ణవేణి, జనసేన పార్టీ కాకినాడ సిటి వీరమహిళలు భవాని, మాలతి, మరియా, శిరీష, లీల, ఓలేటి భారతి మరియు, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి వాసిరెడ్డి శివ, జిల్లా కార్యదర్శి అట్ల సత్యన్నారాయణ, మనోహర్ లాల్ గుప్తా, శ్రీమన్నారాయణ, దుర్గా, ఆకుల శ్రీనివాస్, గౌతం, నాని, కోటేశ్వర రావు, రామారావు, వీరబాబు, సుంకర సురేష్ తదితరులు పాల్గొన్నారు.