రణస్థలంలో జనసేన సన్నాహక ఆత్మీయ సమావేశం

ఎచ్చెర్ల, జనసేన పార్టీ జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో 100% స్ట్రైక్ రేట్ తో ఘనవిజయం సాధించిన తర్వాత జరుపుకునే మొట్టమొదటి జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఈ సంవత్సరం ఓ ఉత్సవంలా జరిపించాలని అధినేత, ఉప ముఖ్యమంత్రివర్యులు పవన్ కళ్యాణ్ మరియు పార్టీ పెద్దల నిర్ణయం. అందులో భాగంగా ఆవిర్భావ సభ విజయవంతం కోసం ఎచ్చెర్ల నియోజకవర్గం నుండి ఇంచార్జ్ విశ్వక్సేన్ ఆధ్వర్యంలో నేడు రణస్థలం దేవిశ్రీ ఫంక్షన్ హాల్ నందు ఘనంగా “జనసేన సన్నాహక ఆత్మీయ సమావేశం” నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో ప్రియతమ డా విశ్వక్సేన్ ఆవిర్భావ సభ విజయవంతం చేయడంపై శ్రేణులకు దిశా నిర్దేశం చేయడం జరిగింది. అనంతరం ‘జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం” పోస్టర్ ను జనసేన శ్రేణులతో కలిసి ఆవిష్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో శ్రీకాకుళం జిల్లా జనసేన ఉపాధ్యక్షులు అర్జున్ భూపతి, రణస్థలం మండల అధ్యక్షులు బస్వా గోవింద్ రెడ్డి, ఎచ్చెర్ల మండల అధ్యక్షులు తమ్మినేని శ్రీను, జిల్లా కార్యదర్శులు వడ్డాది శ్రీను, బొంతు విజయ్ కుమార్, తళబత్తుల పైడిరాజు, దాసరి బలరాం, మండల నాయకులు, పంచాయతీ జనసేన నాయకులు, వీర మహిళలు జనసైనికులు తదితరులు పాల్గొన్నారు.

Share this content:

Post Comment