జనసేన సిద్ధాంతాలను ప్రతి జనసైనికుడు ముందుకు తీసుకెళ్లాలి

పాయకరావుపేట: కోటఉరట్ల మండలం, కొడవటిపూడి గ్రామనికి చెందిన జనసైనికుడు గంటా బాబ్జి కుమారుడు గంటా వంశీ సెప్టెంబర్ 2వ తారీఖున పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా హ్యాపీ బర్త్డే పీ.ఎస్.పీ.కే మై గాడ్ గోడ మీద రాయడంతో శశి కాలేజీ యాజమాన్యం తీవ్రంగా మందులించడంతో తల్లిదండ్రులు రప్పించి క్షమాపణ పత్రం రాయించారు. వంశి తీవ్ర మనస్థాపం చెంది సెప్టెంబర్ 11వ తేదీన మరణించడం జరిగింది. శనివారం జనసేన వీరమహిళ మరియు మాజీ ఎమ్మెల్సీ శ్రీమతి అంగూరి లక్ష్మి శివకుమార్ వంశీ తల్లిదండ్రులకు పరామర్శించి వంశీ తల్లిదండ్రులకు ఆత్మ ధైర్యాన్ని నింపారు. గంటా వంశీకు ఆత్మ శాంతి చేకూరాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా ప్రార్ధించారు. అనంతరం చిన్న బొడ్డేపల్లి గ్రామపంచాయతీ, కరణం కొత్తూరు గ్రామంలో జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వం తీసుకున్న సభ్యులందరికీ గెడ్డం బుజ్జి ఆశీస్సులతో బాలేపల్లి ఏసుబాబు ఆధ్వర్యంలో శ్రీమతి అంగూరి లక్ష్మి శివ కుమార్ చేతుల మీదుగా జనసేన కిట్లు పంపిణీ చేయడం జరిగింది. శ్రీమతి లక్ష్మీ శివ కుమార్ మాట్లాడుతూ జనసైనికులు ఎప్పుడు పవన్ కళ్యాణ్ గారిని దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరూ పార్టీ కోసం పని చేయాలని చెప్పారు. పార్టీ యొక్క సిద్ధాంతాలను ఆశయాలను ప్రతి ఒక్క జనసైనికుడు ముందుకు తీసుకెళ్లాలి. మీకు ఏ సందర్భంలో ఇటువంటి సమస్య వచ్చిన నాకు తెలియజేయండి. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి జనసైనికులకు అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.