నలిశెట్టి శ్రీధర్ పై దాడికి జనసేన నిరసన

ఆత్మకూరు నియోజకవర్గం, దువ్వూరు గ్రామంలో జనసేన పార్టీ ఇంచార్జ్ నలిశెట్టి శ్రీధర్ పై ఇసుక అక్రమ రవాణాను అడ్డుకున్నందుకు గాను వైసిపి నాయకులు చేసిన దాడిని ఖండిస్తూ జనసేన పార్టీ తరఫున సోమవారం స్థానిక గాంధీ బొమ్మ వద్ద నుంచి అంబేద్కర్ బొమ్మ వరకు నిరసన ర్యాలీ చేపట్టారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, వీరమహిళలు మరియు జనసైనికులు పాల్గొన్నారు.