ఫార్వేటి మండపము కూల్చివేతకు వ్యతిరేకంగా జనసేన నిరసన

మదనపల్లి: తిరుమలలో ఫార్వేటి మండపము కూల్చివేతకు వ్యతిరేకంగా మదనపల్లి మండలం శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయం ముందర జనసేన పార్టీ రాయలసీమ కో కన్వీనర్ గంగారపు రామదాసు చౌదరి ఆధ్వర్యంలో జనసేన నాయకులు కార్యకర్తలతో కలిసి నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసిపి పాలనలో ముఖ్యంగా హిందూ దేవాలయాలకి, హిందూ సంస్కృతికి, హిందూ ధర్మానికి రక్షణ లేకుండా పోయిందని ఇప్పటివరకు అనేక దేవాలయాల మీద దాడులు జరుగుతూనే ఉన్నాయి. ఈ ముఖ్యమంత్రి కి ఎనిమిది మీద వాన కురిసినట్టే ఉంది బుధవారం తిరుపతిలో పురాతనమైన పార్వతీ మండపంలో ఒక స్తంభము డ్యామేజ్ అయినదని ఆ మండపాన్ని అన్నమయ్య జీవించిన మండపము మీద దాడి జరిగింది. దీని మీద జనసేన పార్టీ తీవ్రంగా ఖండిస్తుందని అన్నారు. ఆగ్రాలో తాజమహల్, హైదరాబాదులో చార్మినార్ డ్యామేజ్ అయితే వాటిని కూల్చివేసి కొత్తగా నిర్మిస్తారా అని సీఎం జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నిస్తున్నామని అన్నారు. పురాతన ఆలయాలను, పురాతన కట్టడాలని, పురాతన ధర్మాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత అందరిమీద ఉందని కానీ ఈ వైసీపీ ప్రభుత్వం ఇలాంటి కట్టడాలని మా భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయని అన్నారు. హిందూ బంధువులందరూ కూడా రాబోయే ఎన్నికల్లో ఈ వైసీపీకి ముఖ్యమంత్రికి తగిన బుద్ధి చెప్తారని జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి జంగాల శివరాం రాయల్, ఐటీ విభాగ నాయకులు జగదీష్, మదనపల్లి రూరల్ మండల అధ్యక్షులు గ్రానైట్ బాబు, మోహన, కుమార్, గడ్డం లక్ష్మిపతి, నాగ, నవాజ్ తదితరులు పాల్గొన్నారు.