అరకు నియోజకవర్గంలో జనసేన నిరసన ర్యాలీ

అరకు నియోజకవర్గం: జనసేన పార్టీ అధినేత పవన్ ఉన్న కళ్యాణ్ వాలంటీర్లను ఉద్దేశించి మాట్లాడిన మాటలను తప్పుగా దుష్ప్రచారం చేస్తూ వైసీపీ నాయకులు గ్రామ వాలంటీర్లను రెచ్చగొట్టి చేస్తున్న ప్రచారాన్ని వ్యతిరేకిస్తూ.. అరకు నియోజకవర్గంలో శుక్రవారం జనసేన పార్టీ ఆధ్వర్యంలో భారీ ఎత్తున నిరసన ర్యాలీ చేపట్టి, అనంతరం పవన్ కళ్యాణ్ యొక్క చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో బంగారు రామదాసు మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ రాష్ట్ర ప్రభుత్వము అరాచకమైనటువంటి పరిపాలన సాగిస్తుందని, ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాటలను వక్రీకరించి వాలంటీర్ల చేత పోలీస్ స్టేషన్లో పవన్ కళ్యాణ్ గారి మీద కేసులు పెట్టడం జరుగుతుంది. వాలంటీర్లు పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాటలను అర్థం చేసుకొని మాట్లాడాలని, అభివృద్ధి మీద ఏ మాత్రం చిత్తశుద్ధి లేకుండా అవినీతే లక్ష్యంగా నైపుణ్యం కలిగిన లక్షలాదిమంది యువతను కేవలం 5000 రూపాయలు ఇచ్చి, వెట్టి చాకిరీ చేయిస్తు, యువతను వైసీపీ కార్యకర్తలుగా మార్చే ప్రయత్నము చేస్తున్నారు. యువతను నిరుద్యోగులుగా మార్చుతున్నారు. ఉద్యోగ క్యాలెండర్ లేదు, ఉపాధి అవకాశాలు లేవు, అభివృద్ధి లేదు. ఇలా ఏ ఒక్క సిద్ధాంతాలపై మాట్లాడ లేని వైసీపీ నాయకులు వ్యక్తిగత దూషణలకు దిగడం, యువతను ప్రక్క తోవ పట్టిస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారికి క్షమాపణ చెప్పి వైసిపి పార్టీ చేస్తున్నటువంటి దురాత్మకమైనటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ప్రజలు విడుదల పొందాలని, వాలంటీర్లు పవన్ కళ్యాణ్ గారిని క్షమాపణ చెప్పి పోలీస్ స్టేషన్ లో పెట్టిన కేసులు వాపసు తీసుకోవాలని జనసేన పార్టీ బంగారు రామదాసు అరకు నియోజకవర్గం నాయకుడు డిమాండ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో బంగారు రామదాసు అరకు నియోజకవర్గం నాయకుడు మాదల శ్రీరాములు, పార్లమెంట్ అధికార ప్రతినిధి కే లక్ష్మణరావు, పార్లమెంట్ వర్కింగ్ కమిటీ చెట్టి ఆనంద్, పార్లమెంట్ ఎగ్జిక్యూటివ్ నెంబర్ కిల్లో బాబురావు, పార్లమెంటు ఎగ్జిక్యూటివ్ కమిటీ అల్లంగి రామకృష్ణ, అరకు మండల నాయకులు శ్రావణ్ కుమార్ పవన్ ముంచింగ్, పూట మండల పి సురేష్, కార్యనిర్వకణ కమిటీ సభ్యుడు మండల నాయకులు ముత్యం ప్రసాదు, కే చిన్నారావు, పి పవన్ కుమార్, జనసైనికులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేశారు.