గుండ్లకమ్మ చప్టాపై బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని నిరసన తెలియజేసిన జనసేన

ప్రకాశం జిల్లా, మార్కాపురం నియోజకవర్గం మార్కాపురం మండలంలోని పెద్ద నాగులవరం గ్రామం వద్ద గల గుండ్లకమ్మ చప్టాపై బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని నిరసన తెలియజేసిన జనసేన పార్టీ మార్కాపురం నియోజకవర్గ ఇన్చార్జ్ ఇమ్మడి కాశినాథ్. భారీ వర్షాలు కురిసిన సమయంలో గుండ్లకమ్మ చప్టాపై రాకపోకలకు తీవ్ర అంతరాయం కలగడమే గాక గతంలో ఆరుగురు మృత్యువాతకు గురయ్యారని తెలిపారు. డిసెంబర్ 3 తేదీన మధ్యాహ్నం సమయంలో పల్లెపు కోటయ్య (వయస్సు 65 సం.) అనే వ్యక్తి చప్టాపై నుంచి జారి నీళ్లలో పడిపోతే ఇప్పటివరకు అధికార యంత్రాంగం అతని ఆచూకీ తెలుసుకోలేక పోయిందని తెలిపారు. ఇప్పటివరకు ఏడుగురు మృత్యువాత పడ్డారని, ఇది ముమ్మాటికి ప్రభుత్వ హత్యలేనని, నాయకులు, సంబంధిత అధికారులు చేసే అలసత్వానికి ప్రజలు అసువులు బారుతున్నారని, ఇప్పటికైనా ప్రభుత్వం, అధికారులు స్పందించకపోతే గ్రామ ప్రజలతో కలిసి హైకోర్టులో ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం దాఖలు చేస్తామని తెలిపారు. మృత్యువాత పడిన ప్రతి ఒక్కరి కుటుంబానికి 25 లక్షల చొప్పున ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి తిరుమలశెట్టి వీరయ్య, జనసేన నాయకులు మార్కెట్ శ్రీను, రామకృష్ణ, జనసైనికులు పిచ్చయ్య, రఫీ, చంద్రశేఖర్, వెంకటనారాయణ, కళ్యాణ్, రవి, హరీష్ వీరిశెట్టి శ్రీనివాసులు, జనసేన నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.