పెన్షన్ కోత బాధితుల తరుపున జనసేన నిరసన

విశాఖపట్నం, 88 వార్డ్, యాదవ్ జగ్గరాజుపేట గ్రామంలో సుమారు 72 పెన్షన్ దారులను తొలగిస్తామని నోటీసులు ఇచ్చిన ప్రభుత్వ వైఖరికి నిరసనగా జనసేన పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది, ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు వబ్బిన జనార్ధన శ్రీకాంత్ మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలు నుండి వీరికి పెన్షన్లు వేరువేరు ప్రభుత్వాలు ఇస్తూ వస్తున్నాయని, ఇప్పుడు ఈ యొక్క వైఎస్ఆర్సిపి ప్రభుత్వం కొత్త కొత్త నిబంధనలు తీసుకుని వచ్చి పెన్షన్లు తీసివేయడాన్ని జనసేన పార్టీ ద్వారా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని, గత 18 సంవత్సరాల నుండి తీసుకుంటున్న పెన్షన్ లును ఇప్పుడు కొత్త నిబంధనలు చూపించి తొలగించడానికి ప్రభుత్వానికి ఎటువంటి హక్కు ఉందని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నిస్తున్నామని, వృద్ధులు, వితంతువులు పెన్షన్లు తీయడంతో పాటు అంగవైకల్యంతో బాధపడుతున్న దివ్యాంగుల, పెన్షన్లు కూడా తీసిన ప్రభుత్వాన్ని రాజన్న ప్రభుత్వం అంటామా లేక రాక్షక ప్రభుత్వం అంటామా..? ప్రజలే చెప్పాలని, వీరందరూ తరపున మంగళవారం సచివాలయం అడ్మిన్ కి త్వరగా వీళ్ళందరికీ పెన్షన్ లు వచ్చేలాగా అమలు చేయాలని వినతిపత్రం ఇవ్వడం జరిగిందని, వీరికి తర్వాత నెలలో పెన్షన్ ఇవ్వలేని మెడల వీరందరి తరుపున జనసేన పార్టీ ప్రభుత్వంపై మరింత ఒత్తిడి వచ్చేలాగా కార్యక్రమాలు చేపడతామని, ఈ పెన్షన్ ల మీద ఆధారపడే వీరి జీవనం సాగుతుంది, కావున మీడియా ప్రతినిధులు కూడా మాకు సహకరించి ఈ యొక్క సమస్యను ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకుని వెళ్లేలా కృషి చేయాలని, స్థానిక ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి కి, స్థానిక కార్పొరేటర్ మొల్లి ముత్యాల నాయుడుకు ఎన్నికల్లో ప్రజలు తాలూకు ఓట్లు కావాలి కానీ ప్రజా సమస్యల మీద పట్టవా అని ప్రశ్నిస్తూ.. మీరిద్దరూ కూడా ఈ యొక్క గ్రామంలో పర్యటించి వీరికి పెన్షన్ వచ్చేలాగా కృషి చేయాలని, లేని యెడల రేపు రాబోవు రోజుల్లో ప్రజల వ్యతిరేకతను ఓటు రూపంలో మీకు చూపించవలసి వస్తుందని హెచ్చరిస్తున్నామని చెప్పడం జరిగింది. స్థానిక నాయకులు చిన్నా మాట్లాడుతూ మా యొక్క గ్రామంలో ఈ యొక్క పెన్షన్ లకు నోటీసులను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం, పేద ప్రజల్ని ఈ విధంగా ఇబ్బంది పెట్టడానికి ప్రభుత్వాన్ని దుశ్చర్య పరిగణిస్తూ తప్పకుండా రాబోయే రోజుల్లో ఈ యొక్క పేద ప్రజల వెనకాల జనసేన పార్టీ ఉంటుందని, పేద ప్రజల కోసం అధ్యక్షులు పవన్ కళ్యాణ్ స్పూర్తితో ఎంతవరకైనా వెళ్తామని మీ అందరికీ మాటిస్తామని మాట్లాడం జరిగింది. ఈ కార్యక్రమంలో అశోక్, బాబురావు, ప్రసాద్, గోపి, చలం, చిన్నారావు, మరియు జనసైనికులు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.