భవ్యశ్రీకి న్యాయం జరగాలంటూ కొవ్వొత్తులతో జనసేన నిరసన

  • భవ్యశ్రీ హత్య కేసులో నిందితులను వెంటనే శిక్షించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన జనసేన నాయకులు మరియు ప్రజాసంఘాలు

మైలవరం: సెప్టెంబర్ లో చిత్తూరు జిల్లాలోని పెనుమూరు మండలం తానా వెంకటపురం అనే గ్రామానికి చెందిన ఇంటర్ చదువుతున్న విద్యార్థి పదిహేడేళ్ల మైనర్ బాలికను ముగ్గురు యువకులు బాలికపై అతికిరాతకంగా లైంగికదాడి చేసి తన జుట్టు కత్తిరించి ఆ బాలికను చంపి బావిలో పడవేసిన ఘటన జరిగి దాదాపు పదిహేను రోజులు గడిచినా ప్రభుత్వం దోషులను శిక్షించలేదని సోమవారం రాత్రి రెడ్డిగూడెం హై స్కూల్ దగ్గరనుండి స్థానిక పెట్రోల్ బంకు వరకు జనసేన పార్టీ నాయకులు ప్రజాసంఘాలతో కలిసి కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో భవ్యశ్రీ హత్యకేసులో నిందులను వెంటనే శిక్షించాలి, బాధితురాలి తల్లిదండ్రులకు న్యాయం చేయాలి అని నినాదాలు చేస్తూ కొవ్వొత్తుల ప్రదర్శన చేపట్టారు. ఈ కార్యక్రమంలో భాగంగా రెడ్డిగూడెం ప్రధాన కూడలి నందు జనసేన పార్టీ రెడ్డిగూడెం మండల అధ్యక్షులు చాపలమడుగు కాంతారావు మాట్లాడుతూ మన రాష్ట్రంలో ఇలాంటివి జరగడం కొత్తేమీ కాదని ఎన్ని సార్లు ఇలాంటి దారుణాలు జరిగినా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు ఉంటుంది తప్ప ఎలాంటి తప్పులు జరగకుండా చర్యలు తీసుకోవడం లేదని గతంలో ఎక్కడో పక్క రాష్ట్రంలో ఇలాంటి ఒక సంఘటన జరిగితే మన రాష్ట్రంలో హుటాహుటిన దిశ అనే చట్టాని ఏర్పరచారనీ చట్టాన్ని ఏర్పరచడం తప్ప అది అమలు పర్చడం మాత్రం జరగడం లేదని చట్టం ఏర్పాటు చేయడంలో చూపించిన అత్యుస్తాహం సీయం జగన్ రెడ్డికి ఆచరించడంలో చర్యలు తీసుకోవడం లేదని ఈ ఘటన జరిగి ఇన్ని రోజులు గడుస్తున్నా గానీ ప్రభుత్వ అధికారులు కానీ మహిళా మంత్రులు కానీ సీయం జగన్ రెడ్డి గానీ స్పందించకపోవడం చాలా బాధాకరమైన విషయం అని ఈ రాష్ట్రంలో అగ్రకులాల ఆడ బిడ్డలకు ఇచ్చే విలువ మిగతా బడుగు బలహీనర్గాలకు చెందిన ఆడబిడ్డలకు ఇవ్వడంలేదని అగ్రకులాల ఆడబిడ్డలకే మానప్రాణాలు ఉంటాయా మగతా ఆడబిడ్డలకు ఉండవా అని ప్రశ్నించారు. డెబ్బై ఐదు ఏళ్ల స్వాతంత్ర భారతదేశంలో బడుగుబలహీన వర్గాల ప్రజలను కేవలం ఓటర్లుగానే చూస్తున్నారు తప్ప మనుషులుగా గుర్తించడం లేదని అన్నారు. ఉపాధ్యక్షులు పాములపాటి సుందరరామిరెడ్డి మాట్లాడుతూ గాంధీ జయంతి రోజున ఇలాంటి నిరసనలు చేయటం చాలా విషాదకరమని గాంధీజీ కలలు కన్న స్వరాజ్యం స్త్రీలు అర్ధ రాత్రి రోడ్డుమీద తిరిగే రోజే నిజమైన స్వరాజ్యం అని అన్నారు. కానీ దానికి పూర్తి భిన్నంగా మన రాష్ట్రంలో జరిగే పరిణామాలు ఉన్నాయన్నారు. పట్టపగలే ఆడవారికి ఎన్నో ఇబ్బందులు ఎదరవుతున్నాయన్నారు. ఈ ప్రభుత్వం నిందితులపై కటిన చర్యలు తీసుకోవాలని అలా తీసుకోకపోతే ఈ నిరసనలు ఇంకా జరుగుతూనే ఉంటాయన్నారు. జనసేన నాయకులు తోట క్రాంతిబాబు మాట్లాడుతూ గతంలో మంత్రి రోజా ఆడకూతురికి అన్యాయం జరిగితే గన్ కంటే జగన్ ముందు వస్తాడు అన్నారు మరి ఒక దళిత మైనర్ బాలికపై దాడి జరిగి ఇన్ని రోజుల అవుతున్నా గన్ను రాలేదు మీ జగనూ రాలేదు అని ఎద్దేవా చేశారు. ఏపీ యం ఆర్ పీ యస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు మల్లాది ప్రసాదరావు మాట్లాడుతూ రాబోయే వారం రోజుల్లో దోషులను కటినంగా శిక్షించాలని ఆ శిక్ష విధించిన తర్వాత మళ్లీ ఇలాంటి హత్యచారాలు చెయ్యాలంటే వారి వెన్నులో వణుకు పుట్టే విధంగా శిక్షించాలని అలా శిక్షించనిచో రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేసి ప్రభుత్వంపై వత్తిడి తీసుకొస్తామని చెప్పారు. ఆ కుటుంబానికి యాభై లక్షల రూపాయలు నష్ట పరిహారం ఇవ్వాలని ఆ కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బిసీ నాయకులు నమ్మిక శివనాగులు, మరియు సామాజిక నాయకులు శరణంశివారెడ్డి, తన్నీరుపద్మారావు, తన్నీరుమారేష్, కోలేటివెంకయ్య, పాములపాటి సత్యనారాయణరెడ్డి మరియు జనసేన నాయకులు, కార్యకర్తలు, యం.రమేష్, షేక్ సుభాని, పి.రమేష్, రామకృష్ణ, దావీదు, అనంత్, అన్వేష్, ప్రవీణ్, ఆదర్శ్, కార్తీక్, నవీన్, అంకరాజు తదితరులు పాల్గొన్నారు.