మండే ఎండలో పాదయాత్రగా వెళ్తున్న భక్తులకు మంచినీళ్ళందించిన జనసేన

శ్రీకాకుళం జిల్లా పాలకొండ నియోజకవర్గం భామిని మండలంలో సొలికిరి మరియు ఇసుకగూడ గ్రామ జనసైనికులు పవన్ కళ్యాణ్ స్ఫూర్తితో, ఆ గ్రామ సమీపంలో ఉన్న కొండ ప్రాంతమైన ఇసుకగూడలో ఉన్న మరియమ్మ చర్చికి పాదయాత్రగా వెళ్తున్న క్రిస్టియన్ సోదర సోదరిమణులకు, భక్తులకు మంచినీళ్ల సదుపాయం ఆ గ్రామ జనసైనికులు వాటర్ ప్యాకెట్ రూపంలో పంచడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ జనసైనికులు అయిన రవీంద్ర, వైకుంఠ, రుద్రపతి, తిరుపతి, సాయి, లోకేష్, అప్పలరాజు, మనోజ్ పాల్గొన్నారు.