ఇచ్చాపురంలో జనసేన బహిరంగ పత్రికా సమావేశం

ఇచ్చాపురం: ఉమ్మడి నెల్లూరు జిల్లా వెంకటగిరిలో శుక్రవారం జరిగిన నేతన్న నేస్తం కార్యక్రమంలో ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ.. జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పై దిగజారుడు వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలపై ఘాటుగా స్పందిస్తూ శనివారం ఇచ్చాపురం జనసేన పార్టీ ఇంచార్జ్ దాసరి రాజు నడిరోడ్డుపై బహిరంగ విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ..
వారాహి విజయ యాత్రలో శ్రీ పవన్ కళ్యాణ్ గారు ప్రజల పక్షాన బాధ్యతాయుతంగా అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చే దమ్ము, ధైర్యం లేకపోవడం వల్లనే శ్రీ జగన్ రెడ్డి తన స్థాయి దిగజారి మాట్లాడుతున్నారు అని, వారాహి విజయ యాత్ర రెండు విడతలు మాత్రమే పూర్తి అయ్యాయని, అంతలోనే మీ ఫ్యాంట్లు తడిసిపోతున్నాయనీ ఎద్దేవా చేశారు. ఇంకా రాష్ట్రం మొత్తం వారాహి యాత్ర పూర్తి అయితే మీ పరిస్థితి ఏంటో ఊహించుకోండి అంటూ చురకలు అంటించారు. అసలు మా అధ్యక్షుడు ప్రశ్నించినది ఏమిటి?
వాలంటీర్లు సేకరిస్తున్న సమాచారం అంతా హైదరాబాద్ నానక్ రామ్ గూడలోని ఎఫ్ఓఏ అనే కంపెనీలో ఎందుకు ఉంది?.. ఆ కంపెనీ ఎవరిది?.. ఈ ప్రశ్నకు సమాధానం చెప్పగలవా? అని ప్రశ్నించారు.
వాలంటీర్లలో కొంతమంది, మహిళలు, మైనర్ బాలికలపై అత్యాచారాలు చేయడం, వేధింపులకు గురి చేయడం, వివాహితుల కాపురాలు కూల్చడం నిజం కాదా? వీరి వేధింపులకు అత్యాచారాలకు బాధ్యులు ఎవరు?.. వాలంటీర్ల ద్వారా సేకరిస్తున్న డేటా దుర్వినియోగం అవుతుంటే ఏ అధికారి? ఏ మంత్రి బాధ్యత తీసుకుంటారు?.. ప్రతి వ్యక్తి యొక్క ఆధార్, బ్యాంకు వివరాలు నుంచి సోషల్ మీడియా అకౌంట్ వివరాలు ఎవరు, ఎక్కడికి, ఎప్పుడు ఏ పని మీద వెళ్తున్నారు.. అవివాహిత మహిళలు, ఒంటరి మహిళలు, యువతుల వివరాలు, వారి ఫోన్ నెంబర్లు సేకరిస్తున్న మాట నిజం కాదా?.. మహిళలు, యువతుల వివరాలు ఏ ఉద్దేశంతో తీసుకుంటున్నారు?. వాలంటీర్లకు ఐడి కార్డులు కూడా లేవు అనేది వాస్తవం కాదా?.. రాష్ట్రంలో మహిళలు అదృశ్యం అవుతున్న సీరియస్ విషయాన్ని శ్రీ పవన్ కళ్యాణ్ గారు ప్రస్తావించారు. ఆ విషయాన్ని మరుగున పెట్టేందుకు ఇలాంటి చెత్త చెత్త మాటలు మాట్లాడుతున్నారు. మా అధినేతే కాదు మేము కూడా ఇచ్చాపురం నుండి ప్రశ్నిస్తున్నాం. వీటన్నిటికీ సమాధానాలు చెప్పండి. ప్రశ్నిస్తే వ్యక్తిగత జీవితం గురించి అవాకులుచెవాకులు పేలుతున్న జగన్ రెడ్డి గురించి మేము కూడా మాట్లాడగలం.. తన తండ్రి చనిపోయినప్పుడు జగన్ ఎక్కడ ఎవరి దగ్గర ఉన్నాడు? కలకత్తాలో ఉన్న మాట వాస్తవమా? కాదా?, అప్పుడు ఆయన ఎవరితో ఏ టైప్ మీటింగులో ఉన్నాడు? బెంగుళూరు ప్యాలెస్ లో చేసిన అరాచకాలు చిట్టా అందరికి తెలుసు. అక్కడ రాసలీలల గురించి, వైసిపి మంత్రుల గంట, అరగంట వ్యవహారాలు గురించి మాకు తెలియదా.? ఈ అరాచకాలు బయటకు వస్తాయని ఇటీవల కర్ణాటక ఎన్నికల్లో ఆ రాష్ట్ర కీలక కాంగ్రెస్ నాయకుడికి ఎన్నికల ఫండ్ పేరుతో ఎన్ని వందల కోట్లు పంపించారు? ఆ డబ్బులు తీసుకువెళ్లే బాధ్యతను ఏ ఉన్నతాధికారికి అప్పగించారో త్వరలో బయటపెడతాం.. మీ ఇళ్లల్లో ఉన్న వారి అక్రమ సంబంధాలు వాటి నేపథ్యంలో జరిగిన నేరాలు కూడా కడప జిల్లాలో ఎవరిని అడిగినా చెబుతారు. తల్లిని, చెల్లిని కూడా బయటకు గెంటేసిన వ్యక్తి ఈ రోజు నీతులు చెబుతున్నాడు. ఆడవాళ్ళు అంటే గౌరవం లేని ఈ పెద్ద మనిషి రాష్ట్రంలో ఆడవాళ్ళకి రక్షణ కల్పిస్తాడంట, అని చురకలు అంటించారు. జగన్ గారు మీలాగే మేము కూడా దిగజారి, నీచంగా మాట్లాడగలం. కానీ మాకు సంస్కారం ఉంది. అందుకే హద్దుల్లో ఉండి మాట్లాడుతున్నాము.
మీ ఓటమి మీ కళ్ళు ముందు కనిపిస్తోంది. అందుకే గిలగిలా కొట్టుకుంటూ సంధిలు ప్రేలాపనలు పేలుతున్నారు అని ధ్వజమెత్తారు. సీఎం గారు మీకు చివరగా చెప్పేదేమిటంటే దమ్ములు దమ్ములు అని ఎగిసి పడే మీరు మరియు మీ మంత్రులు, మీ ఎమ్మెల్యేలు, దమ్ముంటే మమ్మల్ని రాజకీయంగా ఎదుర్కొండి.. లేదు మేము అలా కాదు రాజకీయంగా ఎదుర్కొలేము, మాకు చేతకాదు, మేము వ్యక్తిగతంగానే విమర్శలు చేస్తాము అంటే నవ్వులపాలు అయ్యేది మీరే.. ఇప్పటికే ప్రజలు మీ నీచపు బుద్ధికి చీ కొడుతున్నారు. ఒకరి వైపు వేలెత్తి చూపిస్తే మీ వైపు కూడా మిగతా వేళ్ళు చూస్తున్నాయనీ, అది తెలుసుకుంటే మంచిదని.. ఇంకో సారి ఇలాంటి నీచపు, దిగజారుడు వ్యాఖ్యలు పవన్ కళ్యాణ్ గారిపై చేస్తే, దానికి ఇంకా ఘాటుగానే స్పందించాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర జాయింట్ సెక్రెటరీ తిప్పని దుర్యోధన రెడ్డి, రాష్ట్ర మత్స్యకార కార్యదర్శి నాగుల హరి బెహరా, ఇచ్చాపురం మండల అధ్యక్షురాలు నీలా వేణి, మున్సిపాలిటీ ఇంచార్జ్ లు దాసరి శేఖర్, రోకళ్ల భాస్కర్, కలియ గౌడ, జిల్లా ప్రోగ్రామ్ కమిటీ సభ్యులు దివాకర్, సర్పంచ్ అభ్యర్థి అంగన సురేష్, ఎంపీటీసీ అభ్యర్థి సుశీల, వీరమహిళ శైలజ, చందు, సంతోష్, హేమ చలపతి, ఈశ్వర్, జోగారావు, మోహన్, కిరణ్, రాము, రాజా, జనసైనికులు తదితరులు పాల్గొన్నారు.